శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2017 (15:26 IST)

ఫేస్ బుక్ వేధింపులు.. ఫ్రెండ్ అంటూ ప్రేమించమన్నాడు.. కాదనే సరికి ఫోటోలు పోస్ట్ చేశాడు..

సోషల్ మీడియాలో అగ్రగామి ఫేస్ బుక్ ద్వారా ప్రేమించాల్సిందిగా వేధించిన యువకుడిని బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదో చనువుగా మాట్లాడుతున్నాడని.. స్నేహితుడిగా అతనితో సెల్ఫీ తీసుకున్న ప

సోషల్ మీడియాలో అగ్రగామి ఫేస్ బుక్ ద్వారా ప్రేమించాల్సిందిగా వేధించిన యువకుడిని బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదో చనువుగా మాట్లాడుతున్నాడని.. స్నేహితుడిగా అతనితో సెల్ఫీ తీసుకున్న పాపానికి బాధితురాలి ఫోటోను ఫేస్ బుక్‌లో పెట్టేశాడు నిందితుడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేరేడ్ మెట్‌కు చెందిన ప్రవీణ్ అనే యువకుడు ఎల్బీనగర్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నాడు. 
 
అక్కడే పనిచేస్తున్న ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆమెకూడా ఫ్రెండ్‌గా భావించింది. ఈ క్రమంలో కొన్ని ఫోటోలు కూడా తీసుకుంది. ఆ ఫోటోలే ఆమెకు చిక్కు తెచ్చిపెట్టాయి. కొన్నాళ్లయ్యాక ప్రవీణ్ ఆ యువతిని ప్రేమించాల్సిందిగా వేధించాడు. అయితే ఆ యువతి అతనిని ప్రేమించట్లేదని చెప్పేసింది. దీంతో సదరు యువతి ఉద్యోగం కూడా మానేసింది. 
 
అయినా ప్రవీణ్ ఫోన్, సోషల్ మీడియా ద్వారా వేధించడం మొదలెట్టాడు. ఈ సందర్భంగా బాధితురాలికే తెలియకుండా తీసిన ఫోటోలను ఫేస్ బుక్‌లో పెట్టేశాడు. ఈ విషయం తెలియరావడంతో ప్రవీణ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప్ర‌వీణ్‌ను అరెస్టు చేసి, అతడి నుంచి ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.