Roja: జగనన్నతో భేటీ అయిన ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత జగన్మోహన్ రెడ్డిని.. సినీనటి రోజా కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. నగరి నియోజకవర్గంలో ఇటీవలి రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండవ కుమారుడు, గాలి జగదీష్‌ను పార్టీలోకి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జగదీష్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చేరతారని టాక్ వస్తోంది. కానీ రోజా తీవ్ర అభ్యంతరాల కారణంగా ఆయన చేరిక ఆగిపోయిందని సమాచారం.
ఈ నేపథ్యంలో, జగన్ మోహన్ రెడ్డి రోజాతో జరిగిన సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చ ద్వారా జగదీష్ వైఎస్సార్‌సీపీలోకి వచ్చే అవకాశంపై స్పష్టత వస్తుందని సమాచారం.