సంబంధిత వార్తలు
- షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే వైఎస్సార్ ఆత్మతో మాట్లాడేందుకు ప్రయత్నించా: కెఎ పాల్
- కాంగ్రెస్ పార్టీ అండమాన్లో పని చేయమన్నా చేస్తాను : వైఎస్ షర్మిల (వీడియో)
- కుటుంబంలో చిచ్చు పెట్టుకుని మాపై పడితే ఎలా? చంద్రబాబు
- వైఎస్ఆర్ మనవడి పెళ్లికి రావాలని అన్నకు ఆహ్వాన పత్రిక ఇచ్చా... వైఎస్ షర్మిల
- ఏపీ సీఎం జగన్ను కలిసిన సోదరి వైఎస్ షర్మిల
షర్మిలకు అంతా జగన్ నేర్పాడు.. కాంగ్రెస్ గమనించాలి.. హర్షకుమార్
తెలంగాణ బిడ్డ వైఎస్ షర్మిలకు ఆంధ్రాలో పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపడితే బూడిదలో పూసిన పన్నీరే అవుతుందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఏపీ పీసీపీ పగ్గాలు షర్మిలకు ఇవ్వొద్దని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందంటూ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ బిడ్డ అంటూ చెప్పిన షర్మిల.. హైదరాబాదులో ఎన్నికలు వచ్చేటప్పటికి పోటీ చేయలేని పరిస్థితి వచ్చిందని ఎత్తి చూపారు. ఢిల్లీలో ఎలా మెలగాలి.. కాంగ్రెస్ పెద్దలతో ఎలా ఉండాలి.. అక్కడ నుంచి ఏమి హామీలు తీసుకోవాలి అని ట్రైనింగ్ ఇచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి పంపించాడన్నారు.
షర్మిలకి పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే వచ్చే పరిణామాల గురించి ఆలోచించాలనే ఇలా మాట్లాడుతున్నానని హర్షకుమార్ పేర్కొన్నారు. జగన్, షర్మిల ఇద్దరూ ఒకటేనని హర్ష కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనుభవజ్ఞులైన నేతలున్నారని.. వారిలో ఎవరినైనా పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయాలని చెప్పారు.
తర్వాతి కథనం
