గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (07:50 IST)

వైఎస్ఆర్ మనవడి పెళ్లికి రావాలని అన్నకు ఆహ్వాన పత్రిక ఇచ్చా... వైఎస్ షర్మిల

ys sharmila
తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చినట్టు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం జగన్‌, వదిన భారతీ రెడ్డిలను కలిసి, తన కుమారుడు వివాహానికి హాజరుకావాలని వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. అక్కడ నుంచి నేరుగా గన్నవరం చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం వద్ద షర్మిల విలేకరులతో మాట్లాడుతూ, ఠరాజేశేఖర్ రెడ్డిగారి మనవడు పెళ్లికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను ఆహ్వానించా. వారు సానుకూలంగా స్పందించారు" అని చెప్పారు. 
 
కాగా, వైఎస్ షర్మిలతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. అయితే, షర్మిల కాన్వాయ్ వెళ్లిన కాసేపటికి ఆయన వాహనం క్యాంపు ఆఫీసుకు రావడంతో పోలీసులు ఆయనను సీఎం నివాసం వైపు వెళ్ళకుండా నిలిపివేశారు. కాసేపటికి ఆదేశాలు రావడంతో సీఎం నివాసంలోకి పంపించారు. గన్నవరం నుంచి వస్తుండగా ట్రాఫిక్‌లో తన వాహన చిక్కుకునిపోవడంతో షర్మిల వెంట రాలేకపోయానని ఆయన చెప్పారు. 

వీళ్లు పోలీసులా? ఛీ.. ఛీ.. ఏపీ పరువు తీసేశారు...
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు దిగజారిపోయారు. వీరు పోలీసులేనా అన్నంతస్థాయికి పడిపోయారు. తన వద్ద కొంతకాలం పాటు కారు డ్రైవరుగా పని చేసి మానేసిన దళిత యువకుడిని హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన అధికార వైకాపాకు చెందిన శాసనమండలి సభ్యుడు అనంతబాబుకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. ఇందుకోసం ఒకరి వెనుక ఒకరు వరుసక్రమంలో నిల్చొని, పుష్పగుచ్ఛాలు ఇచ్చిమరీ శుభాకాంక్షలు చెప్పి ప్రసన్నం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఏపీ పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిలుపై బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. 
 
"దళిత యువకుడ్ని చంపి, బెయిల్‌పై బయట ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వాడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు పోలీసులు ఇలా పోటీ పడ్డారు" అంటా కామెంట్స్ చేస్తున్నారు. "సిగ్గూ ఎగ్గూ లేని అధికారులు.. నేరస్థుల కొమ్ము కాసే ఇలాంటి వారు ఆ వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నారు" అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. 
 
"ఇదేనా పాలెగాడు జగన్ రెడ్డి రాజ్యంలో దళితులకి జరిగే న్యాయం? ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ముందు సాగిలపడ్డ ఏపీ పోలీసులు. ఈ ప్రభుత్వంలో బాధిత కుటుంబాలకు న్యాయం అనేది జరుగుతుందా? స్వయంగా జగన్ రెడ్డి, కోడి కత్తి కేసులో ఒక దళితుడికి అన్యాయం చేస్తుంటే, ఈ సైకో ముఠా కూడా ఇలాగే దళితులపై పడ్డారు" అంటూ తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. మొత్తంమీద ఏపీ పోలీసులు నడుచుకున్న తీరు ఇపుడు ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తుంది.