ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (15:17 IST)

హైదరాబాద్‌కు వెళుతున్న సీఎం జగన్.. ఎందుకో తెలుసా?

kcr - jagan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం హైదారాబాద్ నగరానికి వస్తున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఇటీవల తన ఫామ్‌హౌస్‌లో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుజారిపడిన విషయం తెల్సిందే. ఆయనకు సోమాజిగూడలో ఉన్న యశోద ఆస్పత్రిలో తుంటె ఎముకకు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడటంత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
అయితే, కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నపుడే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, హీరో అక్కినేన నాగార్జున ఇలా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడలేదు. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని నంది నగర్‌లో ఉన్న తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఆయన విమానాశ్రయం నుంచి నేరుకాగ కేసీఆర్ నివాసానికి వెళ్ళి పరామర్శిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. 
 
సుప్రీంకోర్టులో ఆదానీకి భారీ ఊరట.. సిట్ దర్యాప్తునకు నో 
 
ఆదానీ గ్రూపు అధిపతి గౌతమ్ ఆదానీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. హిండెన్ బర్గ్ వివాదంలో ప్రత్యేక దర్యాప్తు సిట్ విచారణకు నో చెప్పింది. అదేసమయంలో సెబీ విచారణకు పచ్చజెండా ఊపింది. సెబీ దర్యాప్తుపై విశ్వాసం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పైగా, మీడియా రిపోర్టులపై ఆధారపడలేమని వ్యాఖ్యానించింది. అలాగే, వివాదంపై మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సెబీకి షరతు విధించింది. 
 
హిండెన్ బర్గ్ వివాదంలో అదానీ గ్రూపుకను క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. సెబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సెబీ దర్యాప్తుపై విశ్వాసం ప్రకటించిన అపెక్స్ కోర్టు.. సిట్ దర్యాప్తు అక్కర్లేదని పేర్కొంది. కేసు బదిలీకి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. హిండెన్ బర్గ్ నివేదికపై మిగతా దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో మీడియా రిపోర్టులపై ఆధారపడలేమని వ్యాఖ్యానించింది. 
 
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం ఈ తీర్పును వెలువరించింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ కెపెనీ గత యేడాది అదానీ గ్రూపుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆర్థిక అవకతవకలు పాల్పడినట్టు ఓ నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక దేశంలో పెను దుమారాన్ని రేపింది. దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ విచారణ చేపట్టింది. అయితే, ఈ అంశంపై సెబీ విచారణ సరిపోదని, సిట్ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుధీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.