1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (19:04 IST)

అబద్దాలు చెప్పడం నాకు అస్సలు తెలియదు : సీఎం జగన్

jagan
ప్రజలను మోసగించేందుకు తనకు అబద్దాలు చెప్పడం అస్సలు తెలియదని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో లంచాలు ఇస్తేనే ప్రజలకు పని జరిగేదన్నారు. కానీ, తమ ప్రభుత్వంలో ప్రజల చెంతకే అన్ని వస్తున్నాయన్నారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బాబు అవినీతిలో పవన్‌కు కూడా భాగస్వామ్యం ఉండటం వల్లే ఆయన ప్రశ్నించడం లేదన్నారు. చంద్రబాబు అవినీతిని ఏబీఎల్, ఈటీవీ, టీపీ5 చూపించవని విమర్శించారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్ళి పరామర్శించిన ఘనక పవన్ కళ్యాణ్‌ది అని అన్నారు. 
 
రాబోయో రోజుల్లో కుటుంబాల్లో చిచ్చులు పెట్టి.. రాజకీయ కుట్రలకు తెర తీరస్తారని పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని అన్నారు. వాళ్లలాగా తనకు అబద్ధాలు చెప్పడం తనకు రాదన్నారు. తాను దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు. గత 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నో హామీలు ఇచ్చారని, పేదలకు 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు.