శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2023 (15:46 IST)

రామ్ గోపాల్ వర్మ వ్యూహం బెడిసికొట్టింది

vyuham cancel poster
vyuham cancel poster
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ దర్శకుడు రామ్ గోపాల్  వర్మ రూపొందించిన సినిమా "వ్యూహం". ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా, వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఇటీవలే వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. కానీ ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. అయినా సరే వ్యూహం సినిమాను ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలచేయనున్నట్లు ప్రకటించారు.
 
కానీ వర్మ వ్యూహం బెడిసికొట్టింది. తనను కొందరు హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారనీ హైదరాబాద్ లో వర్మ కేసు పెట్టారు ఇదిలావుండగా, ఇలాంటి సినిమా విడుదల చేస్తే నాలుగు నెలలో ఆంధ్రలో రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీపై తీవ్ర ప్రభావం చూపనున్నందని కొందరు కోర్టులో కేసు వేశారు.
 
దాంతో పూర్తిగా సమీక్షించిన తర్వాత వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వ్యూహం సినిమా పై కీలక తీర్పు వెల్లడించిన న్యాయస్థానం
లోకేష్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.సినిమా రిలీజ్ అయితే ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందన్న న్యాయస్థానం.చిత్రం లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయన్న హైకోర్టు. అందుకే జనవరి 11 వరకు సినిమాను హైకోర్టు నిలుపుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో హైలైట్ గా మారింది.