గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (19:23 IST)

ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సోదరి వైఎస్ షర్మిల

Jagan_Sharmila
Jagan_Sharmila
ఏపీ సీఎం జగన్‌ను తాడేపల్లిలో ఆయన సోదరి షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అన్న జగన్‌ను, వదిన వైఎస్ భారతిని కుటుంబ సమేతంగా కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియకు ఫిబ్రవరి 17న వివాహం ఫిక్స్ అయిందని కుటుంబ సమేతంగా హాజరుకావాలని జగన్‌ను ఆహ్వానించారు. 
 
అలాగే ఈ నెల 18న జరిగే ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి సైతం రావాలని షర్మిల కోరారు. కాగా, ష‌ర్మిల‌తో పాటు వైసిపిని వీడిన మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా జ‌గ‌న్ నివాసానికి వెళ్ల‌డం విశేషం. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ స్థాపించినప్పటి నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో షర్మిల భేటీ కావడం ఇది తొలిసారి కావడం గమనార్హం.