1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (23:25 IST)

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే వైఎస్సార్ ఆత్మతో మాట్లాడేందుకు ప్రయత్నించా: కెఎ పాల్

KA Paul comments on YS Sharmila
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంపై కె.ఎ పాల్ స్పందించారు. ప్రపంచంలోని 200 దేశాల్లో కూడా జరగనటువంటి భయంకరమైన రాజకీయాలు మన దేశంలో జరుగుతున్నాయని అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు అనగానే నేను ఓ ప్రయత్నం చేసాను.
 
నాకు వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరూ తెలుసు. అందుకే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే వాళ్లిద్దరి ఆత్మలతో మాట్లాడేందుకు ప్రయత్నించా. వాళ్లు బతికి వుంటే షర్మిల చేసిన పనికి ఏమైపోయేవారో అంటూ చెప్పారు. 
 
రాజశేఖర్ రెడ్డి గారు నాకు పరిచయం గనక వారి ఆత్మతో కమ్యూనికేట్ చేయటానికి ప్రయత్నించాను. రాజరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే షర్మిలని ఏ విధంగా అడ్డుకునేవారో నాకు అర్థమైంది.రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, అసలు ఇంత దరిద్రమైన రాజకీయాలు 200 దేశాల్లో ఎక్కడ చూడలేదు అని కెఎ పాల్ చెప్పుకొచ్చారు.