దక్షిణాఫ్రికా-భారత్ రెండో టెస్టు.. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో అదుర్స్
దక్షిణాఫ్రికా-భారత్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్2లో ఆరు వికెట్లతో పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డును సృష్టించాడు. 92 ఏళ్ల ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక పేసర్ లంచ్ బ్రేక్‌కు ముందు 5 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. అయితే, సిరాజ్‌కు ముందు ఎడమచేతి వాటం స్పిన్నర్ మణీందర్ సింగ్ మాత్రమే ఈ రికార్డును సాధించాడు. 1986-1987లో బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌పై టెస్టులో ఈ ఘనత సాధించాడు.
కాగా బుధవారం దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు. పేస్, స్వింగ్, సీమ్ బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా కేవలం 23.2 ఓవర్లలోనే 55 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటిస్ జట్టును 55 రన్స్‌కే పరిమితం చేసిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ జోరు కొనసాగించారు. దాంతో, తొలి రోజు ఆట ముగిసే సరికి సఫారీ జట్టు 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. భారత్ కంటే దక్షిణాఫ్రికా 36 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆలౌటయ్యింది. రబడ, ఎంగిడి ధాటికి 153 పరుగులకే కుప్పకూలింది.