విశ్వం V838 Monocreotis చిత్రాన్ని షేర్ చేసిన నాసా
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా అద్భుత చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. విశ్వం అద్భుతమైన చిత్రాలను పంచుకుంది. ఈ చిత్రాలు అంతరిక్ష ప్రేమికులను మంత్రముగ్దులను చేస్తుంది. యుఎస్ స్పేస్ ఏజెన్సీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఎడ్యుకేషనల్ అంతరిక్షాన్ని ప్రదర్శించే మనోహరమైన చిత్రాలను పంచుకుంది. ఇవి చూడటానికి చాలా అందంగా వున్నాయి.
ఇటీవలి పోస్ట్‌లో, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) V838 Monocreotis అనే సుదూర నక్షత్రం చుట్టూ విస్తరిస్తున్న కాంతి వలయం చిత్రాన్ని షేర్ చేసింది. V838 Mon భూమికి దాదాపు 20,000 కాంతి సంవత్సరాల దూరంలో పాలపుంత గెలాక్సీ వెలుపలి అంచున ఉందని అంతరిక్ష సంస్థ తెలిపింది.