గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (10:35 IST)

కుటుంబంలో చిచ్చు పెట్టుకుని మాపై పడితే ఎలా? చంద్రబాబు

Chandra babu Naidu
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరుతుండటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగనన్న వదిలిన బాణం... ఇప్పుడు రివర్స్ లో తిరుగుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ మాదిరి ఏపీలో కూడా కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభావం వైసీపీపై పడుతుందని అన్నారు. చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తల్లి, చెల్లి వ్యవహారాన్ని జగనే చూసుకోవాలని అన్నారు. 
 
కుటుంబంలో చిచ్చు పెట్టుకుని మాపై పడితే ఎలా అంటూ ప్రశ్నించారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో ఆమె తన పార్టీని విలీనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.