శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 నవంబరు 2016 (09:21 IST)

రెస్టు రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి.. అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసిన అకౌంటెంట్

మహిళల దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రెస్టు రూముల్లో సీసీ కెమెరాలను అమర్చి ఆ దృశ్యాలను చూపి బ్లాక్ మెయిల్‌కు దిగిన ఘటన రాజమహేంద్రవరంలోని కేజేఆర్ ఫార్మా కాలేజీలో చోటుచేసుకుంది. కాలేజీలో అకౌంటె

మహిళల దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రెస్టు రూముల్లో సీసీ కెమెరాలను అమర్చి ఆ దృశ్యాలను చూపి బ్లాక్ మెయిల్‌కు దిగిన ఘటన రాజమహేంద్రవరంలోని కేజేఆర్ ఫార్మా కాలేజీలో చోటుచేసుకుంది. కాలేజీలో అకౌంటెంట్‌గా పనిచేస్తూ, విద్యార్థినుల హాస్టల్‌కు ఇన్ చార్జ్ గా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి  రెస్టు రూముల్లో కెమెరాలను అమర్చి.. అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేవాడు. 
 
విద్యార్థినులకు ఏ అవసరం వచ్చినా, తన దగ్గరకే రావాల్సి వుండటంతో, వారి అవసరాలను అలుసుగా తీసుకున్న శ్రీనివాస్ వారి వద్ద అసభ్య పదాలతో వేధించడమే కాకుండా.. వారికి అసభ్యకరమైన వీడియోలు పంపండం వంటివి చేసేవాడు. దీంతో విద్యార్థినులు అకౌంటెంట్‌పై యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అతనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు నిరసనలకు దిగారు. ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు.