మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (09:02 IST)

ప్రధాని మోడీని నడి రోడ్డుపై ఉరి తీయాలి : సీపీఐ కె నారాయణ

పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలను రోడ్లు పాల్జేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నడి రోడ్డుపై ఉరి తీయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్

పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలను రోడ్లు పాల్జేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నడి రోడ్డుపై ఉరి తీయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో సామాన్య ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్న విషయంతెల్సిందే. 
 
అయితే మోడీ నిర్ణయం వల్ల సెలబ్రిటీల కంటే సామాన్య ప్రజలే ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారని ప్రతిపక్షాల నాయకులు మోడీపై విరుచుకు పడుతున్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల కనీస అవసరాలను తీర్చుకోవడానికి సైతం సామాన్యుడు నానా తంటాలు పడుతున్నాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంపై సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ మండి పడ్డారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... కరెన్సీ నోటుపై ఇంత మొత్తానికి హామీ ఇస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ సంతకంతో ఉంటుందని, అలాంటి నోటును రద్దు చేసిన మోడీని నడివీధిలో ఉరితీసినా తప్పులేదన్నారు. గాంధీజీ బొమ్మ ఉన్న కరెన్సీని చిత్తు కాగితంగా మార్చి అవమానించినందుకు ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారే తప్ప ప్రజలపై ప్రేమతో కాదన్నారు.