గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 జులై 2017 (14:07 IST)

పవరులేని "ఆ" సీక్రెట్‌ను బహిర్గతం చేసిందనీ భార్యను గొడ్డలితో నరికేశాడు...

తనలో ఉన్న లైంగికలోపాన్ని బహిర్గతం చేయడంతో అవమానంగా భావించిన ఆ భర్త ఉన్మాదిగా మారి కట్టుకున్న భార్యను గొడ్డలితో నిలువునా నరికేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొం

తనలో ఉన్న లైంగికలోపాన్ని బహిర్గతం చేయడంతో అవమానంగా భావించిన ఆ భర్త ఉన్మాదిగా మారి కట్టుకున్న భార్యను గొడ్డలితో నిలువునా నరికేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామ పంచాయతీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
గత ఏప్రిల్‌ చివర్లో గోదావరిఖనికి చెందిన గుగులోతు తిరోజ (21)ను అక్కన్నపేట మండలం మల్‌చెర్వు తండాకు చెందిన గుగులోతు రఘుతో వివాహం జరిగింది. అయితే, రఘుతో దాంపత్య జీవితం సాగడంలేదని తిరోజ ఆమె తల్లి దండ్రులకు తెలిపింది. పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించి సర్దిచెప్పారు. 
 
అయినా సరే రఘు ప్రవర్తనలో మార్పు రాలేదు కదా తన పరువు తీస్తుందని భార్యపై కక్షపెంచుకున్నాడు. మంగళవారం ఎవరు లేని సమయం చూసి తిరోజను గొడ్డలితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సాయంత్రం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పరారీలో ఉన్న రఘు కోసం గాలిస్తున్నారు. పెళ్లయిన మూడు నెలలకే ఈ దారుణం జరిగింది.