శిరీష కుమార్తె దీప్తి డిగ్రీ వరకు చదివే ఖర్చులు నేనే భరిస్తా: ఏపీ సీఐడీ ఐజీ సునీల్ కుమార్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష కేసు ముగిసిన నేపథ్యంలో ఆమె కుమార్తె దీప్తిని చదివించేందుకు ఏపీ సీఐడీ ఐజీ సునీల్ కుమార్ ముందుకు వచ్చారు. దీప్తి డిగ్రీ వరకు చదివే ఖర్చులు తానే భర
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష కేసు ముగిసిన నేపథ్యంలో ఆమె కుమార్తె దీప్తిని చదివించేందుకు ఏపీ సీఐడీ ఐజీ సునీల్ కుమార్ ముందుకు వచ్చారు. దీప్తి డిగ్రీ వరకు చదివే ఖర్చులు తానే భరిస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగా దీప్తి చదువుకుంటున్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఆదిత్యా విద్యాలయానికి వెళ్లి చెక్కును అందించారు.
శిరీష ఆత్మహత్య చేసుకుందని.. ఆమెపై అత్యాచారం జరగలేదని.. పోలీసులు తేల్చేశారు. ఈ నేపథ్యంలో తల్లిని కోల్పోయిన దీప్తి ప్రస్తుతం పశ్చిమ గోదావరిలోని ఆదిత్యా స్కూలులో ఎనిమిదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం అమ్మమ్మ, తాతయ్యల వద్ద వద్ద ఉంటున్న దీప్తిని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ఆమె డిగ్రీ ముగించేంత వరకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పుకొచ్చారు.
మరోవైపు బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో విచారణ ముగిసిందని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. శిరీషపై అత్యాచారం జరగలేదని... ఉరి వేసుకోవడం వల్లే చనిపోయినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలోనూ స్పష్టమైందని తెలిపారు. శిరీష్‌ది హత్య అంటూ ఆమె కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌కు శిక్షపడేలా అన్ని చర్యలు తీసుకుంటామంటున్న డీసీపీ తెలిపారు. కాగా శిరీష మృతి కేసులో కీలక నివేదిక బయటకొచ్చింది.
ఇంకా శిరీషపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆ నివేదికను బంజారాహిల్స్ పోలీసులకు అందించారు. శిరీష దుస్తులపై ఉన్న మరకలు ఆహారానికి సంబంధించినవని ఆ నివేదికలో పేర్కొంది.