మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 మే 2017 (13:45 IST)

వడ్డీ చెల్లించలేదని వాచ్‌మెన్ భార్యను ఎత్తుకెళ్లిపోయారు.. పోలీసులు రంగంలోకి దిగి?

కాల్ మనీ ఉదంతం తరహాలోనే హైదరాబాదులో ఘోరం జరిగింది. అప్పు చెల్లించలేదని వడ్డీ వ్యాపారి తన అనుచరులతో ఓ మహిళను కిడ్నాప్ చేయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని డీడీ కాలనీలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు రంగం

కాల్ మనీ ఉదంతం తరహాలోనే హైదరాబాదులో ఘోరం జరిగింది. అప్పు చెల్లించలేదని వడ్డీ వ్యాపారి తన అనుచరులతో ఓ మహిళను కిడ్నాప్ చేయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని డీడీ కాలనీలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో కథ సుఖాంతం అయింది.
 
వివరాల్లోకి వెళితే.. డీడీ కాలనీలో ఆర్కిడ్ అపార్ట్మెంట్ వాచ్మన్ శ్రీనివాస్కు వడ్డీ వ్యాపారి రూ. 3 లక్షలు అప్పుగా ఇచ్చాడు. వందకు పది రూపాయల చొప్పున వడ్డీ చెల్లించాలన్నాడు. వాచ్మన్ కొంతవరకు అప్పు తిరిగి చెల్లించినా మొత్తం అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి చేశాడు. ఆపై సకాలంలో అప్పు చెల్లించలేదని పేర్కొంటూ వాచ్‌మెన్‌ ఇంటిపై గూండాలతో దాడి చేయించాడు. అంతటితో ఆగకుండా.. అతని భార్య నాగమణి కిడ్నాప్ చేశాడు.
 
అప్పు చెల్లిస్తేనే వాచ్‌మెన్ భార్యను వదిలిపెడతామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో జరిగిన విషయంపై వాచ్మన్ శ్రీనివాస్ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగలోకి చర్యలు చేపట్టిన పోలీసులు వడ్డీ వ్యాపారి స్థావరంపై దాడి చేసి నాగమణికి విడిపించారు. వడ్డీ వ్యాపారులను, గుండాలను అరెస్ట్ చేశారు.