శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Updated : బుధవారం, 29 జూన్ 2016 (14:16 IST)

ఎందుకు కొట్టాడో తెలీదు... ప‌రువు పోయిందంటూ అమ్మాయి ఆత్మ‌హ‌త్య‌

అన‌కాప‌ల్లి: తోటి విద్యార్థి తనను కొట్టాడనే మనస్తాపంతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని మళ్లవీధికి చెందిన మళ్ల ధరణి (17) పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌

అన‌కాప‌ల్లి: తోటి విద్యార్థి తనను కొట్టాడనే మనస్తాపంతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని మళ్లవీధికి చెందిన మళ్ల ధరణి (17) పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం రాత్రి సమయంలో ఇంటి వద్ద ఉరి వేసుకుంది. కుటుంబీకులు గమనించేసరికి మృతి చెందింది. 
 
ఈమె చేతిలో ఉన్న ఉత్తరాన్ని కుటుంబీకులు పట్టణ పోలీసులకు అప్పగించారు. అందులో ఆమె రాసిన వివరాల ప్రకారం... కళాశాలలో గణేష్‌ అనే తోటి విద్యార్థి తనను కొట్టాడని, ఎందుకు తనను కొట్టాడో తెలియదని రాసి ఉంది. ఈ విషయంలో తన తప్పు ఉన్నట్లుగా ఉపాధ్యాయులు భావిస్తుండటాన్ని భరించలేక తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. కొద్ది రోజులుగా ఈ విద్యార్థిని కళాశాలకు వెళ్లడం లేదు. కుమార్తె ఆత్మహత్యతో తల్లిదండ్రులు శ్రీనివాస్‌, ఆదిలక్ష్మీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పట్టణ క్రైం ఎస్సై అల్లు వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.