గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (13:17 IST)

2019 ఎన్నికలు.. 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం.. జనసేనాని పవన్

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.  తాము వామపక్షాలతో తప్ప మరెవరితో కలిసి 2019 సాధారణ ఎన్నికల్లో పోటీచేయమని క్లారిటీ ఇచ్చారు. యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని.. పవర్ స్టార్ స్పష్టం చేశారు.


2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్ ... ఆ తర్వాత కొన్ని మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. 
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తమతో కలిసి పోటీ చేస్తే తప్పేముందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంతో.. జనసేనాని గురువారం వివరణ ఇచ్చారు. అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దంటూ పిలుపు నిచ్చారు.
 
కొత్త నాయకత్వం చూస్తున్నామని.. యువతకే అవకాశం ఇవ్వనున్నట్లు పవన్ చెప్పారు. పాతిక సంవత్సరాల యువత భవిష్యత్తుకు అండగా వుండాలనే ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు జనసేనాని వెల్లడించారు. అనుభవజ్ఞుల నేతలతో కలిసి ఎన్నికల్లో వెళ్తున్నామని.. జనసైనికులు యువత, మహిళలకు అవకాశమిచ్చే నాయకత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.