సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2017 (17:48 IST)

మా వాడు ఢిల్లీకి వెళ్లింది అందుకే.. జగన్‌ ఏమీ తెలియదా? వాడికి అన్నీ తెలుసు: జేసీ

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారనే అంశంపై కాదని.. తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ ర

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారనే అంశంపై కాదని.. తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. మనం గుడికి వెళ్లి దేవుడిని ఆపదల నుంచి గట్టెక్కించమని వేడుకుంటాం.. జగన్‌ కూడా అంతేనని జేసీ ఎద్దేవా చేశారు.

కేసుల నుంచి తప్పించండి మహా ప్రభో అని కోరుకోవడానికే మావాడు ఢిల్లీకి వెళ్లాడని ఎద్దేవా చేశారు. తనపై ఉన్న ఈడీ కేసుల నుంచి విముక్తి పొందడానికే పార్టీ ఫిరాయింపులదారుల అంశాన్ని పేపర్లో రాసుకుని జగన్ ఢిల్లీకి వెళ్లాడని జేసీ అన్నారు. 
 
జగన్‌కు ఏమీ తెలియదనుకుంటే పొరపాటేనని.. వాడికి అన్నీ తెలుసునని జేసీ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారంటూ జగన్ ఢిల్లీలో పలువురుని కలుస్తుండటంపై జేసీ ఫైర్ అయ్యారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ రాష్ట్రపతి వద్దకు వెళ్తే ప్రయోజనం లేదన్నారు. దీనిపై ఇక్కడున్న ముఖ్యమంత్రి వద్దకు కానీ, లేదా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వద్దకు కానీ వెళ్లాలని సూచించారు.