శుక్రవారం, 17 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ESHWAR
Last Updated : గురువారం, 24 జులై 2014 (12:38 IST)

ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి డీజీపీగా జేవీ రాముడు నియామకం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీగా జేవీ రాముడు నియమితులయ్యారు. ఈయన ఈపదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ప్రజలు, ప్రభుత్వం సహకారంతో ఏపీ పోలీస్‌ శాఖకు పూర్వవైభవం తీసుకొస్తానని పూర్తిస్థాయి ఆయన వెల్లడించారు. ఇన్‌చార్జి డీజీపీగా ఉన్న ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9.45కు డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఏపీ పోలీస్‌కు ఒక గొప్పస్థానం ఉందని, ఇప్పుడు ఏపీలో పలు విభాగాలను తిరిగి పునరుద్ధరించాల్సి ఉందన్నారు. 
 
శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడబోమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు శాయశక్తులా కృషిచేస్తానన్నారు. 1981 బ్యాచ్‌ చెందిన జేవీ రాముడు రాష్ట్రం జూన్‌ ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యూపీఎస్సీ ప్యానెల్‌కు అనుగుణంగా మొదటి ప్రాధాన్యతలో ఉన్న ఆయన పూర్తిస్థాయి డీజీపీగా ఎంపికచేస్తారు. దీంతో రెండేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా కొనసాగుతారు.