బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 30 జూన్ 2016 (16:42 IST)

స‌చివాల‌యం అటెండెన్స్... మంత్రి కిమిడి మృణాళిని టాప్!

అమరావతి: వెల‌గ‌పూడి కొత్త స‌చివాల‌యంలో మంత్రుల ప‌నితీరులో కిమిడి మృణాళిని ముందువ‌ర‌స‌లో ఉన్నారు. ఆమె స‌చివాల‌యం ప్రారంభం నుంచి నిత్యం త‌న కార్యాల‌యానికే అంకిత‌మైపోతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా వెలగపూడి లోని కొత్త సచివాలయాన్ని సీఎం చంద్

అమరావతి:  వెల‌గ‌పూడి కొత్త స‌చివాల‌యంలో మంత్రుల ప‌నితీరులో కిమిడి మృణాళిని ముందువ‌ర‌స‌లో ఉన్నారు. ఆమె స‌చివాల‌యం ప్రారంభం నుంచి నిత్యం త‌న కార్యాల‌యానికే అంకిత‌మైపోతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా వెలగపూడి లోని కొత్త సచివాలయాన్ని సీఎం చంద్ర‌బాబు ప్రారంభించారు. అనంత‌రం ఇక్క‌డ అన్ని మంత్రుల కార్యాల‌యాలు ప్రారంభం అయ్యాయి. 
 
తొలి రోజు లాంఛ‌నంగా మంత్రులు వ‌చ్చి ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత ఏశాఖ మంత్రీ తిరిగి కార్యాల‌యం ముఖం చూడ‌లేదు. కానీ, గృహనిర్మాణం, గ్రామీణాభివృద్ధి పారిశుధ్య శాఖల మంత్రి డా.కిమిడి మృణాళిని మాత్రం రోజు ఠంచ‌న్‌గా ఉద‌యం 10 గంట‌ల‌కే స‌చివాల‌యానికి వ‌చ్చేస్తున్నారు. ఉన్న‌తాధికారుల‌తో త‌న కార్యాల‌యంలో స‌మావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి ప‌నుల‌ను స‌మీక్షిస్తున్నారు. దీనితోపాటు తాత్కాలిక స‌చివాల‌యం ప‌నుల‌ను కూడా చూస్తున్నారు. 
 
పిడి హౌసింగ్ , పిడి డ్వామా గుంటూరు అధికారులతో  అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి మృణాళిని, తాను నిత్యం స‌చివాల‌యానికి స‌మ‌యానికి వ‌చ్చేస్తాన‌ని చెప్పారు. దీనితో ఉన్న‌తాధికారులంతా అల‌ర్ట్ అయిపోయారు.  సీఆర్ డిఏ అడిషనల్ కమీషనర్ మల్లిఖార్జునతో సచివాలయపనులపై ఆరా తీసిన మంత్రి మృణాళిని, ఇక్క‌డి రోడ్లు, ఇత‌ర సౌక‌ర్యాల‌ను వెంట‌నే అభివృద్ది చేయాల‌ని సూచించారు.