మంగళవారం, 22 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 3 జూన్ 2016 (13:22 IST)

చిన్నమ్మను కోర్కె తీర్చమన్న యువకుడు... చెబితే చంపేశారు...

కామాంధులకు వావివరసలు ఉండటంలేదు. తల్లి తర్వాత తల్లి అని చెప్పే చిన్నమ్మ(చిన్నాన్న భార్య)ను కోర్కె తీర్చమని గోలపెట్టిన యువకుడి బాగోతాన్ని భర్తతో, కుటుంబ సభ్యులతో చెప్పినందుకు ఆమెనే చంపేశారు. వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా మల్కాపురంలో రాధమ్మకు గంగ

కామాంధులకు వావివరసలు ఉండటంలేదు. తల్లి తర్వాత తల్లి అని చెప్పే చిన్నమ్మ(చిన్నాన్న భార్య)ను కోర్కె తీర్చమని గోలపెట్టిన యువకుడి బాగోతాన్ని భర్తతో, కుటుంబ సభ్యులతో చెప్పినందుకు ఆమెనే చంపేశారు. వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా మల్కాపురంలో రాధమ్మకు గంగప్పతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఐతే... వివాహం జరిగింది కానీ వారు కాపురం సజావుగా సాగలేదు. రాధమ్మకు మూర్చ రోగం ఉందంటూ భర్త, కుటుంబ సభ్యులు వేధించడం మొదలుపెట్టారు. పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. 
 
ఇదిలావుండగా మే నెల 29వ తేదీన రాధమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా తన బావ కుమారుడు ఆమె చేయి పట్టుకుని తన కోర్కె తీర్చాలంటూ అత్యాచారం చేయబోయాడు. దీనితో ఆమె కేకలు వేసింది. ఆ కేకలకు అతడు పారిపోయాడు. ఆ తర్వాత విషయాన్ని భర్తకు, యువకుడి తల్లిదండ్రులుక చెప్పింది రాధమ్మ. అంతే... వారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. చిన్నపిల్లవాడి మీద నిందలు వేస్తావా అంటూ ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 
 
ఆమె హాహాకారాలు విన్న ఇరుగుపొరుగువారు మంటలార్పి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు వాస్తవాన్ని వెలికి తెప్పించారు. దీనితో భర్త కురువ గంగప్ప, అత్తమామలు లింగమ్మ, ఈరన్న, బావ నర్సింహులు, ఆయన భార్య అయ్యమ్మ, వారి కొడుకు నాగరాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.