సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (12:46 IST)

వస్త్ర దుకాణం కుర్రాడితో ప్రేమలో పడిన మహిళా టెక్కీ... వాడుకుని వదిలేశాడు..

చదువులేని అమ్మాయిలే కాదు.. చదువుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ప్రేమలో మోసపోతున్నారు. ఓ క్లాత్ స్టోర్‌లో పని చేసే కుర్రోడితో ప్రేమలో పడిన 24 యేళ్ల టెక్కీ యువతి చివరకు.. అతనికి సర్వం సమర్పించి మోసపోయ

చదువులేని అమ్మాయిలే కాదు.. చదువుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ప్రేమలో మోసపోతున్నారు. ఓ క్లాత్ స్టోర్‌లో పని చేసే కుర్రోడితో ప్రేమలో పడిన 24 యేళ్ల టెక్కీ యువతి చివరకు.. అతనికి సర్వం సమర్పించి మోసపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... హైదరాబాద్‌, కేపీహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ క్లాత్ స్టోర్‌లో రాజస్థాన్‌కు చెందిన రాజ్ పురోహిత్ అనే కుర్రోడు పని చేస్తున్నాడు. అతనిపై 24 ఏళ్ల యువతి (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌) మనసు పారేసుకుంది. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత పెళ్లి మాటెత్తగానే పత్తాలేకుండా పారిపోయాడు. 
 
దీంతో ఆ యువతి మోసపోయినట్టు గ్రహించి... కేపీహెచ్‌బి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఐపీసీ సెక్షన్-376(రేప్), 420(చీటింగ్) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.