బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 జులై 2017 (12:30 IST)

పెళ్లైంది.. ఇద్దరు సంతానం.. అయినా ప్రేమ వారిని వదల్లేదు.. ఆత్మహత్య చేసుకున్నారు..

పెళ్లైంది. ఆమెకు ఇద్దరు సంతానం. అయినప్పటికీ ఓ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని ప్రేమించింది. అయితే ప్రేమికుడిని కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో.. ఆ ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పెళ్లైంది. ఆమెకు ఇద్దరు సంతానం. అయినప్పటికీ ఓ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని ప్రేమించింది. అయితే ప్రేమికుడిని కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో.. ఆ ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాప్రా జమ్మిగడ్డకు చెందిన కృష్ణ, మాసపేట కావ్య (25) దంపతులు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం ఉన్నారు. 
 
కానీ అదే ప్రాంతంలో ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న నాగరాజు (25) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నాగరాజుకు పెళ్లి కాలేదు. విషయం నాగరాజు కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక కావ్య, నాగరాజు 27న ఇంటి నుంచి బయటికొచ్చారు. ఆపై మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో సికింద్రాబాద్‌ వైపు వచ్చే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారు నాగరాజు, కావ్యగా గుర్తించారు.