గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (10:58 IST)

క్లాస్‌మేట్ అయిన వివాహితపై మనసుపడిన యువకుడు.. కాదన్నందుకు కిడ్నాప్‌కు యత్నం

ఇంటర్‌లో క్లాస్‌మేట్ అయిన వివాహితపై ఓ యువకుడు మనసుపడ్డాడు. భర్తను వీడి వస్తే పెళ్లి చేసుకుంటాను.. జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుతానంటూ ప్రాధేయపడ్డాడు.

ఇంటర్‌లో క్లాస్‌మేట్ అయిన వివాహితపై ఓ యువకుడు మనసుపడ్డాడు. భర్తను వీడి వస్తే పెళ్లి చేసుకుంటాను.. జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుతానంటూ ప్రాధేయపడ్డాడు. దీనికి ఆమె నో చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు. దీంతో సినీ ఫక్కీలో ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి... గ్రామస్థుల చేతిలో దొరికి చితక్కొట్టించుకున్నారు. కడప జిల్లా మైదుకూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైదుకూరు మండలంలోని నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన యువతికి రెండేళ్ళ క్రితం నంద్యాలకు చెందిన యువకుడితో వివాహమైంది. అయితే కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాలతో 7 నెలల నుంచి పుట్టింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తను ఇంట్లో ఉండగా, మండలంలోని కేశాపురానికి చెందిన ఇంటర్‌లో క్లాస్‌మేట్‌ అయిన ఉదయ్‌ కుమార్‌ రెడ్డి ఆమెపై మనసుపడ్డాడు. 
 
దీంతో కొంతమంది స్నేహితులతో కలిసి వివాహిత ఇంటికి వచ్చి బలవంతంగా కారు ఎక్కించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె కేకలు పెట్టడంతో స్థానికులు ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. దీంతో ఉదయ్ వెంట వచ్చిన వారంతా తప్పించుకుని పారిపోయారు. ఉదయ్‌తో పాటు.. ఇద్దరు యువకులు చేతికి చిక్కగా వారిని చితక్కొట్టారు.