శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (10:30 IST)

వడ్డీ వ్యాపారం పేరిట.. వేధింపులు.. బాకీ తీర్చు లేకుంటే.. కోరికైనా తీర్చమంటూ..

వడ్డీ వ్యాపారం పేరిట.. మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యాపారిపై ఎట్టకేలకు కేసు నమోదైంది. బాకీ తీర్చు లేకుంటే.. కోరికైనా తీర్చు అంటూ వేధింపులకు గురిచేస్తున్న ఓ వడ్డీ వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు

వడ్డీ వ్యాపారం పేరిట.. మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యాపారిపై ఎట్టకేలకు కేసు నమోదైంది. బాకీ తీర్చు లేకుంటే.. కోరికైనా తీర్చు అంటూ వేధింపులకు గురిచేస్తున్న ఓ వడ్డీ వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే... మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని ఘనపూర్‌ పంచాయతీ పరిధిలోని దమ్మక్కపల్లిలో చిల్ల సంతయ్య అనే వడ్డీ వ్యాపారి నుంచి అదే గ్రామానికి చెందిన దంపతులు రెండేళ్ల క్రితం కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు. ఆ దంపతులు బాకీ తీర్చకపోవడంతో చిల్లయ్య పంచాయతీ పెట్టాడు. పెద్దలు కొంత గడువిచ్చి బాకీ తీర్చాలని సూచించారు.
 
ఈ క్రమంలో సత్తయ్య బాకీ ఇచ్చిన వివాహిత (25) ను అడ్డుకుని బాకీ తీర్చాలని, లేని పక్షంలో బాకీ కింద తన కోరిక తీర్చాలని వేధించాడు. లేని పక్షంలో ఆమెను, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.