శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (14:05 IST)

మీరు డిగ్రీ చదివారా? అయితే ఓటుకు వెయ్యి...!.. ఎక్కడ?

మీరు వింటున్నది నిజమే. ఇది ఎక్కడో కాదు.. రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న తతంగం. ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో పట్టభద్రుల స్థానంలో గెలిచేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా

మీరు వింటున్నది నిజమే. ఇది ఎక్కడో కాదు.. రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న తతంగం. ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో పట్టభద్రుల స్థానంలో గెలిచేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైకాపాలు పోటీలు పడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ప్రధానంగా అందులో పట్టభద్రుల విషయంలోనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. 
 
రాయలసీమలో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా పైరవీలు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఓటుకు వెయ్యి. డిగ్రీ చదివి పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో ఓటు వేసేందుకు ధరఖాస్తు చేసుకొని ఉంటే ఇక వెయ్యి రూపాయలు మీదే. అది పార్టీ పరిస్థితి. వెయ్యి నుంచి 1500 రూపాయలు కూడా ఇవ్వడానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయట. 
 
ఇది ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు రాయలసీమ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనబడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తపనలో తెలుగుదేశం పార్టీ ఉంటే మరోవైపు అధికార పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇద్దరూ ఇద్దరుగానే పోటీలు పడుతూ ఓటర్లకు డబ్బులు ముట్టజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీరి గొడవ ఎలాగున్నా ప్రస్తుతం బాగా లాభపడుతున్నది డిగ్రీ చదివిన పట్టభద్ర ఓటర్లు మాత్రమే.