శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (02:47 IST)

మోదీ తెలుగులో ఉత్తరం రాశారు సరే.. తెలుగు సీఎంలు నిద్రపోతున్నారా?

మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తెలుగులో రాసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తలదించుకునేలా ఉంది.

మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తెలుగులో రాసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తలదించుకునేలా ఉంది. మాతృభాషా దినోత్సవాల పేరిట, సాహిత్య సభల పేరిట ఆడంబరంగా కార్యక్రమాలు చేసి కోట్లు తగులబెట్టడమే తప్ప తల్లిభాష అభివృద్ధికి ఆవగింజంత తోడ్పాటు అందించిన తెలుగు ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేలా మోదీ తెలంగామ సీఎం జన్మదిన శుభాకాంక్షలను తెలుగులో పంపటం విశేషం. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. కేసీఆర్ పుట్టిన రోజు(శుక్రవారం) సందర్భంగా ఆయనకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే కేసీఆర్ పుట్టిన రోజుకు దగ్గర్లోనే ఫిబ్రవరి 21న(మంగళవారం) మాతృభాషాదినోత్సవం కూడా కావడంతో ఈ లేఖను మోదీ తెలుగులో పంపినట్టు తెలుస్తోంది.
 
దేశ ప్రజలకు మీరు సేవలందించేందుకు వీలుగా కావలసిన ఆరోగ్యకర, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని భగవంతున్ని కోరుతున్నానని మోదీ తెలిపారు. ఈ లేఖను తెలంగాణ సీఎంవో తమ అధికారిక ఫేస్ బుక్‌ పేజీలో సోమవారం పోస్ట్ చేసింది. ఆ లేఖ పూర్తి పాఠం..
 
డియర్ శ్రీ  రావ్,
మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి. దేశ ప్రజలకు మీరు సేవలందించేందుకు వీలుగా కావలసిన ఆరోగ్యకర, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నాను. 
శుభాభినందనలతో, 
మీ భవదీయ
నరేంద్రమోదీ
 
మాతృభాష ప్రాధాన్యం గుర్తెరిగిన ప్రధాని కేసీఅర్ జన్మదిన శుభాకాంక్షలను తెలుగులో పంపితే మన తెలుగు సీఎంలు తెలుగును అధికార భాషగా అమలు చేయడంలో నూటికి నూరు శాతం విఫలమయ్యారు. ఎమ్మెల్యేల కోనుగోళ్లలో, అడ్డగోలు స్కాంలలో, అవినీతి కార్యక్రమాల్లో మునిగితేలుతున్న వీరు కనీసం10 శాతం ఆసక్తిని తెలుగు భాష అభివృద్ధిపైన పెట్టి ఉంటే తెలుగుకు మేలు జరిగేది కాదా. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యను పూర్తిగా ఇంగ్లీషుమయం చేయడంలో తరించిపోతున్నారు తప్పితే కొడిగడుతున్న తెలుగు జ్యోతిని అలరించడానికి కాసింత ఆపన్న హస్తం అందించాలనే దృక్పథం లేని పాలకులనుచి మనం ఏం ఆశించగలం