శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (16:26 IST)

త్వరలోనే రేషన్ బియ్యం అక్రమార్కుల అరెస్టులు : మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

nadendla manohar
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసి అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నవారిని గుర్తించి అరెస్టు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి  నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన బుధవారం కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. ఇందులో అక్రమంగా నిల్వవుంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేయడానికి వీల్లేదని పోర్టు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇదే అంశంప ఆయన మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చే రేషన్ బియ్యాన్ని కొందరు రాజకీయ నేతలు స్మగ్లర్లతో చేతులు కలిపి విదేశాలకు అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారని, ఇలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా, 41ఏ కింద నోటీసులు జారీచేసి రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన వారిని అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. 
 
కాగా, పౌరసరఫరాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాకినాడలో ఆయన విస్తృతంగా పర్యటించి అనేక రేషన్ షాపులను పరిశీలించారు. అలాగే, జిల్లా కేంద్రంలో అక్రమంగా నిల్వవుంచిన వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన గోదాముల్లోని రేషన్ బియ్యాన్ని స్వాధీన చేసుకుని సీజ్ చేశారు.