శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 జనవరి 2024 (21:58 IST)

మేనకూరులోని ఎంపీ ఎస్‌ఈజెడ్‌లో సహజవాయువు పైప్‌లైన్‌ను నష్టపరిచిన స్థానిక జేసీబీ వాహన నిర్వాహకుడు

JCB
నెల్లూరు జిల్లాలోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) నెట్‌వర్క్‌కు అధీకృత సంస్థ అయిన ఏజి&పి (AG&P) ప్రథమ్, జనవరి 4, 2024న మేనకూరు, ఎంపీ ఎస్‌ఈజెడ్‌ సమీపంలో జరిగిన ప్రమాదకరమైన సంఘటన తర్వాత క్లిష్టమైన సవాలును ఎదుర్కొంటోంది. మేనకూరు, అత్తివరం వద్ద గృహ, పారిశ్రామిక, వాణిజ్య మరియు రవాణా వినియోగదారులకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) సరఫరా చేయడానికి మేనకూరు, నాయుడుపేటలోని పారిశ్రామిక పార్కులలో పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ గ్యాస్ పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు, సంబంధిత ప్రభుత్వ అధికారుల నుండి తగిన అనుమతులతో ఏర్పాటు చేయబడ్డాయి.
 
ఈ పైప్ లైన్‌కు AP-07-CR-1719 రిజిస్ట్రేషన్ నంబర్ గల JCB జరిపిన త్రవ్వకాల సమయంలో తీవ్ర నష్టం జరిగింది. ప్రముఖంగా పైప్ లైన్ సంబంధిత  గుర్తులు, హెచ్చరిక సంకేతాలు, అత్యవసర సమాచార బోర్డు ఉన్నప్పటికీ, తృతీయ పక్షం తవ్వకాల పనిని ప్రారంభించే ముందు ఏజి&పి ప్రథమ్‌కు తెలియజేయడంలో లేదా సంఘటనను నివేదించడంలో పూర్తిగా విఫలమైంది. వారి నిర్లక్ష్యం కారణంగా పైప్ దెబ్బతినడంతో పాటుగా భారీగా గ్యాస్ లీకేజీకి దారితీసింది, ప్రజల భద్రత మరియు ఆస్తికి ఇది అసౌకర్యమూ కలిగించింది.
 
భద్రతా మార్గదర్శకాలను పాటించకపోవడం, తవ్వకం పనిని ప్రారంభించే ముందు ఏజి&పి ప్రథమ్‌కు తెలియజేయకపోవడం ప్రభుత్వ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే. ప్రస్తుత చట్టాలు సెక్షన్ 427, 286 ప్రకారం అనధికారిక కార్యకలాపాల ద్వారా నష్టపరిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, 25 కోట్ల వరకు జరిమానా విధించబడుతుంది. ఈ సంఘటన కారణంగా మొత్తం ప్రాంతానికి గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగించడమే కాకుండా అసౌకర్యమూ కలిగించింది. దానితో పాటుగా ఇటువంటి కార్యకలాపాలను చేపట్టే వారి జవాబుదారీతనం, బాధ్యత గురించి కూడా ఆందోళన కలిగించింది. ఈ గ్యాస్ పంపిణీ సంస్థ తిరుపతి జిల్లా, నాయుడుపేట పోలీస్ స్టేషన్‌లో సంఘటనపై ఫిర్యాదు చేసింది, ప్రస్తుతం సంఘటన సమయంలో జరిగిన వాస్తవ నష్టాలను అంచనా వేస్తోంది. చట్ట ప్రకారం నష్టానికి బాధ్యుల నుండి నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
 
ఈ సంఘటన మరోసారి, ఈ తరహా తృతీయ పక్షాల ద్వారా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. చట్టాన్ని అనుసరించడం, ఈ తరహా నిర్లక్ష్యానికి దూరంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. ఇది అనవసరమైన ఖర్చులు లేకుండా గ్యాస్‌ను నిరంతరాయంగా సరఫరా చేయడంలో సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా స్థానిక ప్రజలు ఈ తరహా అసౌకర్యాలతో ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు. స్థానిక అధికారులు అటువంటి సంఘటనలను అరికట్టడానికి, అవసరమైన గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ల సమగ్రతను కాపాడటానికి బాధ్యులపై వేగవంతమైన, సమర్థవంతమైన చర్యలను నిర్ధారించాలి.