సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: ఆదివారం, 16 జులై 2017 (21:20 IST)

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు?

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు దాదాపు ఖరారైంది. రేపు సాయంత్రం వెంకయ్య నామినేషన్లను కూడా దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రిగా ఉన్న వెంకయ్యకు మరింత ఉన్నత పదవి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ భావించారు. అందుకే

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు దాదాపు ఖరారైంది. రేపు సాయంత్రం వెంకయ్య నామినేషన్లను కూడా దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రిగా ఉన్న వెంకయ్యకు మరింత ఉన్నత పదవి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ భావించారు. అందుకే వెంకయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో అందరితో చర్చించిన తరువాతనే వెంకయ్య పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే విపక్ష అభ్యర్థి గాంధీ మనువడు గోపాలక్రిష్ణ ఉన్న విషయం తెలిసిందే. వచ్చే నెల 23న ఎన్నికలు జరుగనున్నాయి. వీరిద్దరు నిలబడితే పోటీ హోరాహోరీగా ఉండక తప్పదు.