సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (22:11 IST)

జగన్ సంతకం చేయరు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: భూమన సవాల్

bhumana karunakar reddy
తిరుమల లడ్డూ వ్యవహారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో వైకాపా చీఫ్ జగన్‌కు పూర్తిగా అర్థంకాని పరిస్థితి నెలకొంది. హిందువులను శాంతింపజేసేందుకు తిరుమల పర్యటనను చేపట్టి ఆపై ఆ టూర్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు.  
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలోకి హిందూయేతరుల ప్రవేశానికి సంబంధించి నిబంధనలను నిర్దేశించింది. ఇంకా తమకు దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్‌పై సంతకం చేయాలి. ఈ ప్రకటనపై సంతకం చేయడానికి జగన్ ఇష్టపడేలా కనిపించలేదు. 
 
"మేము డిక్లరేషన్‌పై ఎందుకు సంతకం చేయాలి? జగన్ సంతకం చేయరు. సంతకం పెట్టకుండానే తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకుంటాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు' అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. 
 
భూమన ఇప్పటివరకు రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయనను వైఎస్ఆర్ ఒకసారి, ఇటీవల జగన్ నియమించారు. భగవంతుని కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి వ్యక్తులను ఏమనాలని ప్రశ్నించారు. 
 
వైఎస్ జగన్‌ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదన్నారు. ముఖ్యమంత్రి హాదాలో ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్‌ను డిక్లరేషన్ అడిగితే ప్రభుత్వ పతనం ప్రారంభమైనట్లేనని భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 
 
టీటీడీ డిక్లరేషన్ మీద వైఎస్ జగన్ ఎందుకు సంతకం పెట్టాలని ప్రశ్నించారు. సాంప్రదాయ దుస్తుల్లో స్వామి వారి దర్శనానికి వెళ్తుంటే ఇంక డిక్లరేషన్ అవసరం ఏమటని ప్రశ్నించారు. మరోవైపు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కుట్రలు చేస్తున్నారంటూ భూమన ఆరోపించారు. 
 
ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ మీద భౌతిక దాడులు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు దిగితే ఊరుకునేది లేదని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు