ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (09:53 IST)

నేడు ఎన్టీఆర్ జయంతి... చంద్రబాబు వెన్నుపోటు వల్లే నా భర్త మరణించారు : లక్ష్మీపార్వతి

నటదిగ్గజం, ఆంధ్రుల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయన భార్య లక్ష్మీపార్వతి, హీరో జూనియర్ ఎన్టీఆర్

నటదిగ్గజం, ఆంధ్రుల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయన భార్య లక్ష్మీపార్వతి, హీరో జూనియర్ ఎన్టీఆర్‌లు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించిన తర్వాత లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ... రాజకీయ వెన్నుపోటుతోనే ఎన్టీఆర్ మరణించారన్నారు. ఎన్టీఆర్ హయాంలో నిర్వహించే ప్రతి మహానాడు పేదవాళ్ళకి ఉపయోగపడేదని, ఇపుడు అ పరిస్థితి కనిపించడం లేదన్నారు. పేదల పార్టీగా చెప్పుకునే టీడీపీ.. ఇప్పుడు పెద్దల పార్టీగా మారిపోయిందని ఆరోపించారు.
 
పార్టీ ఫిరాయింపులను ఎన్టీఆర్ ముందు నుంచే వ్యతిరేకించారని, అలాంటిది ఇప్పుడు చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఏపీలో ఎన్టీఆర్ ఆశయాలు అన్ని పక్కకి వెళ్లిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్‌ వేదికగా చంద్రబాబు మహానాడు నిర్వహించే అధికారంగానీ, అర్హతగానీ లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అలాగే, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లోని తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంట డైరెక్టర్ కొరటాల శివ తదితరులు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉదయం 5.30 గంటల సమయంలో ఎన్టీఆర్ ఘాట్ వచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు.
 
తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆ స్థానం మరెవ్వరికీ దక్కదన్నారు. తెలుగు వారికి ఆయన ఆశీస్సులు ఉంటాయన్నారు. ఎన్టీఆర్‌ కుమారులు హరికృష్ణ, రామకృష్ణ సహా పలువురు కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.