గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 19 జనవరి 2017 (06:17 IST)

మహాత్మాగాందీ కంటే తెలుగు వారికి ఎన్టీఆర్ చేసిందే ఎక్కువట

మహాత్మాగాంధీ కంటే మా ఎన్టీరామారావు తెలుగు ప్రజలకు ఎక్కువ మేలు చేశాడంటూ తెలుగుదేశం ఎంపీ చేసిన ప్రకటన సంచలనహేతువైంది.

మహాత్మాగాంధీ కంటే మా ఎన్టీరామారావు తెలుగు ప్రజలకు ఎక్కువ మేలు చేశాడంటూ తెలుగుదేశం ఎంపీ చేసిన ప్రకటన సంచలనహేతువైంది.  విజయవాడ లోక్‌సభ ఎంపీ కేశినేని శ్రీనివాస్  మాచవరం గ్రామంలోని ఎస్ఆర్ఆర్, సివిఆర్ కాలేజి వద్ద ఎన్టీరామారావు విగ్రహాన్ని వ్యవస్థాపించడాన్ని బలపర్చిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. 
 
ఎన్టీ రామారావు గాంధీకంటే తక్కువవాడేమీ కాదు. నిజానికి మహాత్మాగాంధీ కంటే తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిందే ఎక్కువ అంటూ కేశినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. కాలేజీ వద్ద ఎన్టీఆర్ విగ్రహ స్థాపన ఎంటి, ఎన్టీఅర్ గాంధీ కంటే ఎక్కువా అంటూ కొంతమంది విద్యార్తులు చేసిన వ్యాఖ్యకు కేశినేని తనదైన శైలిలో జవాబిచ్చారు.
 
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు 21వ వర్థంతి సందర్భంగా కాలేజీ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని వ్యతిరేస్తూ ప్రతిపక్ష విద్యార్థ సంఘ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. పోలీసులు అలా నిరసన తెలుపుతున్న విద్యార్థి నేతలు అరెస్టు చేసి తీసుకుపోయారు.  
 
అయితే కాలేజీ యాజమాన్యం, కాలేజీ విద్యార్థి యూనియన్ ఎన్టీర్ విగ్రహాన్ని స్తాపించాలని నిర్ణయించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. 
 
ఈ సందర్భంలోనే ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని రోడ్డుమీద స్థాపించి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించలేదని, దీనిపే ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదని శ్రీనివాస్ సమర్థించారు.