శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (14:22 IST)

నారా లోకేష్‌కు యువకుడు బహిరంగ లేఖ.. పచ్చని పశ్చిమ గోదావరిలో?

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌కు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉదయ్ కిరణ్ అనే యువకుడు రాసిన బహిరంగ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రాభివృద్ధికి ఏపీ సర్కారు చేసిన పనులేంటి? అంటూ ప్రశ్నల

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌కు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉదయ్ కిరణ్ అనే యువకుడు రాసిన బహిరంగ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రాభివృద్ధికి ఏపీ సర్కారు చేసిన పనులేంటి? అంటూ ప్రశ్నలు సంధించాడు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని స్పష్టం చేశాడు. గత ఎన్నికల్లో తాము టీడీపీని గెలిపించామని గుర్తు చేశాడు. ఈ లేఖలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు.. ప్రభుత్వ విధానాలపై నిలదీశాడు. 
 
రాష్ట్రాభివృద్ధి అంతా కంటితుడుపు చర్య అని గుర్తు చేశాడు. రాష్ట్రాభివృద్ధి అంతా కాగితాల మీదేనని చెప్పాడు. విషం చిమ్మే ఆక్వా కంపెనీని పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామాల మధ్యలో ఎందుకు పెట్టినట్లు ఆ వ్యర్థాలను సముద్రంలోకి వదలడానికి వీలుగా ఉంటుందనుకుంటే దాదాపు 972 కిలోమీటర్ల సముద్ర తీరం వున్న మన ఏపీలో ఎక్కడా చోటులేనట్లు వద్దు బాబోయ్ అంటున్న గ్రామాల్లో ఎందుకు పెట్టినట్లు? ఉదయాన్నే లేగ దూడల గిట్టల శబ్ధం విని నిద్రలేచే మాకు పోలీసుల బూట్ల శబ్ధం వినాల్సి వస్తుంది. ఆ ఆక్వా ఫాక్టరీలో ఇప్పటికే నలుగురు విషం వల్ల చనిపోతే మీరు స్పందించలేదే? అంటూ ప్రశ్నించారు. 
 
వైజాగ్‌కు ఎన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చాయని నిలదీశాడు. త్రిపుర సీఎం జీతమెంత? అప్పుల్లో ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జీతమెంత? అని అస్త్రాలు సంధించాడు. కేరళలో అవినీతి 4 శాతం ఉంటే ఏపీలో 27 శాతం ఎందుకుందని ప్రశ్నించాడు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.