శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2023 (16:19 IST)

విద్యార్థినులకు లైంగిక వేధింపులు.. లైబ్రేరియన్‌కు దేహశుద్ధి.. ఎక్కడ?

harassment
ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థునిలను లైంగికంగా వేధిస్తున్నాడంటూ లేబ్రేరియన్‌ భానుప్రకాశ్‌ నాయక్‌ను తల్లిదండ్రులు చితకబాదారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. లోదుస్తుల కలర్‌ చెప్పాలని.. మసాజ్‌ చేయాలంటూ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
గతంలో భానుప్రకాశ్‌పై ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు మండిపడ్డారు. ప్రిన్సిపల్ ఎదుటే లైబ్రేరియన్‌కు దేహశుద్ధి చేశారు. అతడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని భానుప్రకాశ్‌ సమర్థించుకుంటున్నాడు. అయితే, బాధిత విద్యార్థినిలు మాత్రం తమను వేధించారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
బోనులో చిరుత.. ఎట్టకేలకు బంధించిన తితిదే అధికారులు  
 
తిరుమల నడక మార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కింది. చిరుత పట్టుకునేందుకు సిబ్బంది ఘటనా స్థలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బోన్లు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఫలితంగా తిరుమల - అలిపిరి కాలినడక మార్గంలో ఏదో మైలు రాయి వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కింది.
 
కాగా, ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం కాలి నడక మార్గంలో తిరుమలకు వెళుతుండగా అకస్మాత్తుగా చిరుత బాలిక దాడి చేసింది. తల్లిదండ్రుల కంటే ముందు వెళుతున్న బాలికపై రాత్రివేళ దాడి చేసిన చిరుత ఆ తర్వాత పొదల్లోకి చిన్నారిని ఈడ్చుకెళ్లి చంపి తినేసింది. 
 
మరుసటి రోజు ఉదయం బాలిక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగడంతో తిరుమల అదికారుల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెట్ల మార్గంలో చిన్నారులను అనుమతించరాదని వంద మంది భక్తుల చొప్పున ఓ బృందంగా నడక మార్గంలో పంపించేలా భద్రతా ఏర్పాట్లు చేశారు.