1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2016 (11:03 IST)

ఆర్కే.రోజా.. నీ నోరు అదుపులో పెట్టుకో.. లేదా చీరేస్తా : పరిటాల సునీత ప్రశ్న

వైకాపా అధినేత ఆర్కే.రోజాకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. నోరుందికదా అని ఇష్టానుసారంగా మాట్ల

వైకాపా అధినేత ఆర్కే.రోజాకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. నోరుందికదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం తాము సహించే నోరు చీరేస్తామంటూ హెచ్చరించారు. 
 
అమరావతిలో ఆమె మాట్లాడుతూ, డ్వాక్రా రుణమాఫీ చేసి మహిళలకు అండగా నిలబడిన ముఖ్యమంత్రిని మహిళా ద్రోహి అనడానికి ఎమ్మెల్యే రోజాకు నోరెలా వచ్చిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిహక్కు, మహిళా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి, మహిళలకు సముచిత గౌరవం కల్పించినట్టు చెప్పుకొచ్చారు.