ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (10:34 IST)

వైసీపీ ప్రభుత్వసలహాదారులైన 30మందికి తప్ప ఎవరికి మంచిజరిగింది?: పరుచూరి అశోక్ బాబు

‘మంచిచేసిన ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో మద్ధతు పలకండి’ పేరుతో కరపత్రం విడుదలచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి  వైసీపీప్రభుత్వం ఎవరికి మంచిచేసిందో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు నిలదీశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే...!
జగన్ ప్రభుత్వంలో పనీపాటాలేని సలహాదారులు 30మంది వరకు ఉన్నారు. వారికిమాత్రమే ఈప్రభుత్వం మంచిచేసింది. వారిలో సజ్జలకూడా ఉన్నాడుకాబట్టి, ఆయనకు మంచిజరిగింది కాబట్టి అందరికీ మంచిజరిగిందనే భావనలో ఉన్నట్లున్నాడు.

మున్సిపల్ శాఖామంత్రి కరపత్రం విడుదలచేసుంటే, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందనుకోవచ్చు. సలహాదారు విడుదలచేయడంతో  ఈ ప్రభుత్వం చేసిందనుకుంటున్న మంచే ఎవరికి జరిగిందో ప్రజలకు అర్థమవుతోంది.  రామకృష్ణారెడ్డి విడుదలచేసిన కరపత్రం చూశాక అబద్ధంకూడా సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం ఏదైనామంచి అనేది ప్రజలకు చేసుంటే, అందుకు సంబంధించిన జీవోలు, లెక్క లు, ఆధారాలు వాస్తవంలో కనిపించాలి. ప్రభుత్వలెక్కలు ఒకలా, ఆధారాలు మరోలా, సజ్జల విడుదలచేసిన కరపత్రంలో సమాచారం ఇంకోలా ఉంటే ఆసమాచారం అబద్ధంకాక ఏమవుతుంది. ఇదివర  కుఒకసారి ఇలానే అబద్ధాలతోప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారు.

ప్రతిసారీ అలానే వారినిమోసగించాలనుకుంటే, కుదరదు చంద్రబాబుప్రభుత్వం ఇచ్చిన పింఛన్లను రూ.3వేలకు పెంచుతాన న్న జగన్ , అధికారంలోకి వచ్చాక ఎంతపెంచాడో ప్రజలకు తెలియ దా? రూ.1000ని నాలుగుభాగాలు చేస్తే, ఏంచెప్పినా జనం నమ్మేస్తారనుకుంటున్నారా? రాష్ట్రంలో ఎంతమందికి పింఛన్లు ఇస్తు న్నారు అనేప్రశ్నకు సమాధానంగా, ప్రభుత్వమే మే 2019కి ముందు, 54లక్షల02వేల796ఇచ్చారని సమాధానంచెప్పింది.

ఇప్పుడు మొత్తంఇస్తున్న పింఛన్లుఎన్నిఅంటే, 57లక్షల93వేల25 మాత్రమే.  అంటే జగన్ ప్రభుత్వం వచ్చాక కేవలం 3లక్షల93వేల పింఛన్లు మాత్రమే పెంచింది. ఇప్పడువిడుదలచేసిన కరపత్రంలోనే మో, లంచాలిస్తే 54లక్షలమందికి ఆనాటిప్రభుత్వం పింఛన్లు ఇచ్చిం దని చెప్పారు. అలాచెప్పడానికి సిగ్గుందా? 54లక్షలమంది  లంచా లిస్తే, పింఛన్లు ఇచ్చినట్లయితే, ఇప్పుడు వైసీపీప్రభుత్వంకూడా 3లక్షల93వేలపింఛన్లు లంచాలిచ్చిన వారికే ఇస్తోందా?

అక్టోబర్ 2018నాటికి రాష్ట్రంలో కేవలం 44లక్షలపింఛన్లే ఇచ్చారని కరపత్రం లోచెప్పి, అసెంబ్లీలో చెప్పిన సమాధానంలోనేమో 54లక్షలనిచెప్పా రు. అంటే దాదాపు10లక్షల పింఛన్లను తక్కువచేసి, కరపత్రంలో ఎక్కువగా చూపించి ప్రజలను మోసగించాలని చూస్తున్నారా? 

దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామనిచెప్పినవారు, ఇప్పుడు కరపత్రంలో ఏంచెప్పారు? మద్యందుకాణాలను తగ్గించకుండా, జాతీ యహైవేలపక్కన ఉన్న షాపులను తీసేసినట్లుగా చూపించి, కొత్త పాలసీతో ఈప్రభుత్వం వ్యాపారంప్రారంభించింది. జాతీయ రహాదారు లపక్కన వ్యాపారం లేదని షాపులు తీసేస్తే,వాటిని తామే తొలగిం చినట్లుగా ప్రభుత్వం చెప్పుకుంది.

అవితీసేసినాకూడా ఈ ప్రభుత్వా నికి మద్యంఅమ్మకాలతో సంవత్సరానికి రూ.15 నుంచి రూ.18 వేలకోట్ల వరకు ఆదాయం వస్తోంది. రాష్ట్రానికివస్తున్న ఆదాయంలో జీఎస్టీ పన్నులతర్వాత, మద్యంపైనే ఎక్కువ ఆదాయం వస్తోంది. దుకాణాలు తీసేస్తే,ఆదాయం ఎలా పెరుగుతుంది. ఈవ్యవహారం గురించి కరపత్రాల్లో చెప్పకుండా, మద్యపాన నిషేధం చేశామని నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటారు?

మద్యంతాగేవారి దగ్గరకువెళ్లి, సజ్జలగానీ, ఎక్సైజ్ శాఖామంత్రిగానీ మద్యందుకాణాలు తీసేశామని చెబితే, వారుసీసాలతో ప్రభుత్వపెద్దలను కొట్టడంఖాయం. మద్యని షేధంఅనిచెప్పి, సొంతబ్రాండ్లను అధికధరకు అమ్ముతూ, మందు బాబులను దోచుకుంటున్నారు. పింఛన్లపై తప్పుడు సమాచారం ఇచ్చారు. మద్యంవ్యాపారంపైఅబద్ధాలు చెబుతున్నారు. అదేనా మీరు ప్రజలకు చేసినమంచి?

నాడు-నేడు గురించి చెప్పారు. బుద్ధిఉన్నవాడు ఎవడైనా  పాఠశాల ల్లో ప్రమాణాలు ఎలాపెంచాలి... విద్యార్థులకు సౌకర్యాలు ఎలా కల్పించాలని ఆలోచిస్తారు. ఈప్రభుత్వమేమో అవసరంలేకపోయినా సరే సున్నాలువేయండి, మరుగుదొడ్లు కట్టండి, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను దుర్వినియోగంచేయండి అని చెబుతోంది. అనుభవం లేకపోయినా ఉపాధ్యాయులతో బలవంతగా పనులుచేయించారు.

అమ్మఒడి పథకం కింద రూ.15వేలుఇస్తామన్నారు. రెండోఏడాది మరుగుదొడ్ల నిర్వహణపేరుతో రూ.1000కోతపెట్టారు. తొలిఏడాది ఎందరు విద్యార్థులకుఇచ్చారు...రెండో ఏడాది ఎంతమందికి ఇచ్చారో చెప్పండి. రెండోఏడాది విద్యార్థులసంఖ్యఎందుకు తగ్గింది. 44.48లక్షలమంది తల్లులకు అమ్మఒడి ఇచ్చామన్నారు. 44.48మంది నుంచి రూ.1000చొప్పున వసూలుచేస్తే, దాదాపు రూ.444కోట్లవరకు అవుతోంది.

అంతమొత్తం మరుగుదొడ్ల నిర్వహ ణకు ఖర్చుఅవుతుందా? నాడు-నేడు నిధులను కాజేయడంకోసం,  విద్యార్థుల తల్లిదండ్రులకమిటీలతోపనిలేకుండా, ప్రధానోపాధ్యాయు లను ఒత్తిడి చేసి, బిల్లులు చేయించుకున్నారు. ఈ విధంగా దాదా పు 50శాతం నిధులను వైసీపీతాబేదారులే మింగేశారు. ఈ రకంగా జరిగిన అవినీతిని కప్పిపుచ్చి, మేము నాడు-నేడు కింద పాఠశాల లు బాగుచేశామనిచెప్పుకుంటే ఎలా?

నాడు-నేడు పథకంలో జరిగి న అవినీతి బయటకురావాలంటే ప్రభుత్వం తక్షణమే సీబీఐతో విచా రణ జరిపించాలి. అలాజరిపించే ధైర్యం ప్రభుత్వానికి, సలహాదారు సజ్జలకు ఉందా? జనవరి 2019నుంచి చంద్రబాబు ప్రభుత్వం పింఛన్లను రూ.2వేలకుపెంచితే, దాన్ని ఒప్పుకోరు. అమ్మఒడి కింద రూ.15వేలిస్తామనిచెప్పి, రూ.14వేలే ఇచ్చామని మాత్రం ఒప్పుకోరు.

టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగభృతిని రద్దుచేశారు. అధికారంలోకి రాగానే సచివాలయవ్యవస్థ, వాలంటీర్లకింద 4లక్షల మందిని నియమించారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారన్నా రు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుంటే, వారుఎవరు? పార్టీకార్యకర్తలను  ఉద్యోగాల్లో నియమించి, వారికి ప్రభుత్వసొమ్ము కట్టబెడుతూ, పార్టీ పనులకు వాడుకుంటున్నారు.

ఇంతకంటే దోపిడీ ఇంకోటి ఉంటుం దా? దేశంలో ఎక్కడా ఇలాంటి మాయచూడలేదు. 2లక్షల40వేల మందివైసీపీకార్యకర్తలకు, ప్రభుత్వజీతాలిస్తూ, వారితోచేయకూడని పనులుచేయిస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా. ప్రభుత్వమిచ్చే రూ.5వేలతో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిం దా? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు, ఇన్నిలక్షల ఉద్యోగాలుఇచ్చామని కరపత్రంలో ఎలాచెప్పుకుంటారు.

వివిధ శాఖల్లోలక్షకుపైగా ఖాళీలుంటే, వాటిభర్తీకి నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వరు? వాలంటీర్లు ప్రభుత్వఉద్యోగులు కారని ముఖ్యమంత్రి లేఖ రాస్తే, సజ్జలరామకృష్ణారెడ్డేమో కరపత్రంలో 4లక్షలఉద్యోగాలిచ్చామ నిచెప్పుకుంటున్నారు. ప్రజలను ఎలామోసగించాలో వైసీపీప్రభు త్వంలోని సలహాదారులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. ఇసుకమాఫియా గురించి కరపత్రంలో ఎక్కడా చెప్పలేదు.

దాని కారణంగా బలైపోయిన భవన నిర్మాణ, అనుబంధరంగాల వారి సం గతేమిటి? టీడీపీప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500లకు లభిస్తే, ఇప్పుడు, రూ. 6నుంచి రూ.7వేలు పెట్టాల్సివస్తోంది. పెంపుదలతో వసూలుచేస్తున్నసొమ్మంతా ఎక్కడికి పోతోందో సజ్జల చెప్పాలి. ఇసుకను అమ్ముకుంటూ, ఎన్నివేలకోట్లు దోచేశారో కరపత్రంలో సజ్జల ఎందుకుచెప్పలేదు? భవననిర్మాణ కార్మికుల ముందుకు వెళ్లి ఈప్రభుత్వంచేసిన మంచేమిటో సజ్జల చెప్పాలి.

ఇసుకలేక 30 లక్షలమంది కార్మికులు రోడ్డునపడ్డారు. బీసీలకు ఏదో చేశామని చెప్పుకుంటున్నారు. 56కార్పొరేషన్లు పెట్టి, అన్నివర్గాలకు కలిపి రూ.2లక్షల25వేలకోట్లిచ్చి అంతాఅయిపోయిందన్నారు. అదేనా బీసీలను ఉద్ధరించడమంటే? టీడీపీ ప్రభుత్వం బీసీలకు, ఎస్సీలకు, కాపులకు ప్రత్యేకంగా నిధులు మంజూరుచేసి, వారిని స్వయుంఉపాధి దిశగా ప్రోత్సహించింది.

బ్యాంకులద్వారా రుణాలిప్పించడమే కాక, ఆయావర్గాల విద్యార్థులు విదేశాలకువెళ్లి చదువుకునేందుకురూ.10లక్షలు, రూ.15లక్షలను చంద్రబాబు గారు అందించారు. ఆవిధంగా రూ.15 నుంచి రూ.20వేలకోట్లవరకు టీడీపీప్రభుత్వం సాయంచేసింది. ఆనాటిలెక్కలుచూస్తే సజ్జలకు వాస్తవాలు బోధపడతాయి.ఇప్పడు జగన్ ప్రభుత్వ ఏంచేసింది.

అమ్మఒడి, రైతుభరోసాపథకాలను కూడా కులాలవారీగా అమలు చేసింది. కార్పొరేషన్లకు ఇచ్చిన నిధులెన్ని, బడ్జెట్లో సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులెన్నో చెప్పండి. చెప్పేది ఒకటి, కిందిస్థాయిలో జరిగేది మరోటి. సజ్జల విడుదలచేసిన కరపత్రంలో ఎవరికి మంచి జరిగిందో చెప్పాలి. రైతుభరోసాకింద 50లక్షలమంది రైతులకు, రూ.13,500ఇచ్చామని చెప్పారు.

రూ.13,500జగన్ ప్రభుత్వమే ఇచ్చిందా..కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.6వేలసంగతేమిటి? జగన్ ప్రభుత్వం ఇచ్చింది రూ.7,500లేకదా? ఇదిఅబద్ధమా కాదా? సున్నావడ్డీ ఎంతమందికి ఇచ్చారో చెప్పండి. సున్నావడ్డీ కింద ఎంత రుణం రైతులకు అందించారు? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.2లక్షలలోపు రైతురుణాలకు వడ్డీలేకుండా చేసింది. రైతులు అసలు చెల్లిస్తే, ఆనాటిటీడీపీప్రభుత్వం వడ్డీకట్టింది.

ఇప్పుడు జగన్ ప్రభుత్వమేమో రైతులు వడ్డీకట్టాక,వారికి తిరిగి చెల్లిస్తామంటోంది. అదికూడా  కేవలం రూ.లక్షలోపు రుణాలకి మాత్రమే. ఈ విధంగా అన్నీఅబద్ధాలుచెబుతూ, మంచిచేశామంటారా? చివరకు కరోనాతో దేశమంతా విలవిల్లాడుతుంటే, బ్లీచింగ్ పారాసిట్మాల్ తో తగ్గుతుం దన్నారు. బ్లీచింగ్ పౌడర్ పేరుతో మైదాపిండి చల్లి కోట్లకుకోట్లు కాజేశారు.

కరోనాకిట్లు, 108వాహనాలకొనుగోళ్లు, రేషన్ పంపిణీ వాహనాల్లో స్కామ్. ఇలాఅన్నింటినీ దోపిడీకి అనువుగా మార్చు కున్నది జగన్ ప్రభుత్వంకాదా? ఈవాస్తవాలను సజ్జల విడుదల చేసిన కరపత్రంలో ఎందుకుచెప్పరు? రాష్ట్రంలో 8లక్షలమందికి కరోనా చికిత్సచేస్తే, ప్రభుత్వం ఎన్నిలక్షలకిట్లు ఇచ్చిందో చెప్పాలి. కరోనా రోగులకు రూ.500లు ఖర్చు చేసి  భోజనంపెట్టామన్నారు.

రోగులేమో భోజనం సరిగాలేదనిరోడ్లమీదకు వచ్చి గగ్గోలుపెట్టారు.  ఇంటివద్దకే రేషన్ పంపిణీ అన్నారు. రేషన్ పంపిణీ ఆటోలు పొంది నవారిలో 40శాతంమంది ఇదేమి ఉద్యోగంరా బాబూఅంటూ పారిపో తున్నారు. స్థానికఅధికారులకు వాహనాలు అప్పగించి, వెళ్లిపో తున్నారు. ఒక్కోవాహనంకొనుగోలు, దానిలో ఉండే డ్రైవర్, సహాయకుడికి కలిపి రూ.21వేలవరకు ప్రభుత్వం దుబారా చేసింది.

రూ.21వేలు తగలేసేబదులు, రూ.5వేలు డీలర్లకుఇచ్చిఉంటే, సరు కులుసక్రమంగా అందేవికదా? రేషన్ పంపిణీవాహనాలు ఎప్పుడొ స్తాయా అని పనులుమానుకొని ఎదురుచూడాల్సిన దుస్థితిని కల్పించారు. ఇదేనా జగన్ ప్రభుత్వం చేసినమంచి? వాహనమిత్ర పేరుతో ఆటోడ్రైవర్లకు రూ.10వేలిచ్చామన్నారు. రాష్ట్రంలో దాదాపు 8లక్షలఆటోలు ఉంటే, లక్షా 50వేలమందికి ఇచ్చారు.

ఆ సొమ్ముకు రెండింతల సొమ్ముని జరిమానాలరూపంలో ఆర్టీవో అధికారుల సాయంతో తిరిగి వసూలుచేశారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ – డీజిల్ ధరలు పెంచారు. అమ్మఒడి కింద రూ.14వేలిచ్చి, నాన్న బుడ్డిరూపంలో అంతకురెండింతలు మద్యందుకాణాల నుంచి రాబట్టారు. ఇళ్లపట్టాలపేరుతో భారీస్కామ్ కు పాల్పడ్డారు.

సెంటు స్థలమిచ్చి, దానికోసం రూ.8వేలకోట్లవరకు దోపిడీచేశారు. అంతటి తో ఆగకుండా రాబోయేరోజుల్లో ఇళ్లనిర్మాణంపేరుతో మరోదోపిడీకి తెరలేపబోతున్నారు. సజ్జలవిడుదలచేసిన కరపత్రంలో ఒక్కటై నా వాస్తవమని ఆయన నిరూపించాలి. కరపత్రంలోని సమాచారంపై తాముచర్చకుసిద్ధం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి.

ప్రతిపక్షం మేనిఫోస్టో ఇచ్చిందితప్ప, ఎక్కడా కరపత్రాలు ఇవ్వలేదు. ఇన్ని అబద్ధాలు, దుర్మార్గాలతో ఎంతకాలం ప్రజలను మోసగిస్తారు. తప్పలు, మోసాల లెక్క పూర్తయ్యాక ప్రభుత్వాన్నికాపాడటంఎవరి తరంకాదు. 

రాజకీయపండితులు, మేథావులే వైసీపీప్రభుత్వ అబద్ధాలు, దుర్మార్గాలపై ఆశ్చర్యపోతున్నారు. ఇన్నిఅబద్ధాలతో కరపత్రం విడుదలచేసినందుకు సజ్జల ప్రజలకు బహిరంగ క్షమాప ణచెప్పి తప్పుచేశానని ఒప్పుకోవాలి.