బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (13:22 IST)

తిరుమలలో కిడ్నాప్ అయిన వీరేష్.. మహారాష్ట్రలో దొరికాడు..

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమలేశుని ఆలయంలో రెండు రోజుల క్రితం వీరేష్ అనే బాలుడు కిడ్నాప్‌కు గురైయ్యాడు. మహారాష్ట్రలో ఆ బాలుడి ఆచూకీ లభ్యమైంది. ప్రస్తుతం బాలుడిని తిరుపతికి తీసుకొచ్చేందుకు తిరుపతి పోలీసులు మహారాష్ట్రకు ప్రయాణమయ్యారు. 
 
తిరుమలకు వచ్చిన దంపతులు కళ్లుగప్పి వీరేష్ అనే చిన్నారిని శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి కిడ్పాప్ చేశారు. నిందితుడిని సీసీటీవి పుటేజీ ద్వారా గుర్తించిన పోలీసులు  సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
 
సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మామనూరు పోలీసులకు వీరేష్ గురించిన సమాచారాన్ని స్థానికులు ఇచ్చారు. ఇంకా నిందితుడిని పోలీసులకు అప్పగించారు. వీరేష్‌ ఆచూకీ తెలియజేశారు. 
 
శుక్రవారం నాడు  తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు మహరాష్ట్రకు చెందిన ప్రశాంత్ దంపతులు వచ్చారు. వసతి దొరకకపోవడంతో  ఆరుబయటనే వారంతా నిద్రించారు. అయితే ఈ సమయంలోనే వీరేష్ ను నిందితుడు కిడ్నాప్ చేశాడు.