శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (15:35 IST)

పేరెంట్స్ మీటింగ్ జరుగుతుండగా.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కడుపునొప్పితో..?

టీచర్స్-పారెంట్స్ మీటింగ్ జరుగుతుండగా.. స్కూల్ ప్లే పార్కులో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి.. గదిలోకి తీసుకెళ్లిన ప్యూన్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అకృత్యానికి నాలుగేళ్ల చిన్నారి విలవిల్లాడిపోయింది.


వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని ఓ పాఠశాలలో పేరెంట్-టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌ను ముగించుకుని ఇంటికెళ్లేటప్పుడు ఓ నాలుగేళ్ల చిన్నారి.. కడుపు నొప్పితో విలవిల్లాడిపోయింది. అయితే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాలేదనుకుని అదే కడుపునొప్పికి కారణమని ఆ చిన్నారి తల్లిదండ్రులు భావించారు. 
 
అయినా ఈ చిన్నారి తీవ్ర కడుపునొప్పితో బాధపడటం చూసి ఆ నాలుగేళ్ల చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరిశోధించిన వైద్యులు షాక్ అయ్యారు.

చిన్నారి లైంగిక దాడికి గురైనట్లు వైద్యులు తెలిపారు. దీంతో షాకైన తల్లిదండ్రులు చిన్నారి వద్ద ఆరా తీయగా.. స్కూల్ పార్కులో ఆడుకుంటుండగా ఆ స్కూలులో పనిచేసే వ్యక్తి.. ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో ఆవేశానికి గురైన చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై మండిపడుతూ.. పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. 
 
ఇక చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

చిన్నారిపై పార్కులో ఇలాంటి అకృత్యాలు జరుగుతుంటే.. స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని.. దీనిపై తగిన చర్యల కోసం దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ జరుగుతుండగా నాలుగేళ్ల చిన్నారిని గదిలోకి తీసుకెళ్లిన ఆ స్కూల్ ప్యూన్ లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.