సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:05 IST)

'భయం' అంటే ఇదే జగన్‌ రెడ్డి .. పవన్‌కు భయపడి రాత్రికి రాత్రే రోడ్డు వేశారు...

ఏపీలో అధికార వైకాపా నేతలకు భయం అంటే ఏంటో చూపిస్తానంటూ జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అమరావతి వేదికగా హెచ్చరించారు. నిజంగానే ఆయన హెచ్చరికలకు ఏపీ ప్రభుత్వ అధికారులు వణికిపోతున్నట్టున్నారు. 
 
అందుకే తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ రహదారికి రాత్రికి రాత్రే మరమ్మతు పనులు చేపట్టారు. గురువారం రాత్రి నుంచి ఈ పనులు ప్రారంభించారు. ముందుగా గుంతల్లో వ్యర్థాలను తొలగించి శుభ్రపరిచారు. ఈ గుంతల్లో సిమెంట్ కాంక్రీట్ వేయనున్నట్టు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ రోడ్డు అధ్వాన్నంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారడంతో ఈ నెల 2వ తేదీ గాంధీ జయంతి రోజున శ్రమదానం చేసి రోడ్డు వేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకోసం ఆయన 2న కాటన్ బ్యారేజీ వద్దకు రానున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రాత్రికిరాత్రే మరమ్మతు పనులు ప్రారంభించారు.
 
దీనిపై జనసేన పార్టీకి చెందిన ఓ విభాగం భయం అంటే ఇదీ జగన్ రెడ్డి అంటూ ఓ ట్వీట్ చేసింది. "బ్యారేజిపై రోడ్లెసేందుకు అనుమతి ఇవ్వం రూల్స్ ఒప్పుకోవు, రాష్ట్రంలో రోడ్లు బాగానే ఉన్నాయన్నారు, జనసేన వారే గుంతలు తీసారని గ్రామ సింహాలతో గొంకారాలు చేయించారు. చివరికి పవన్ కళ్యాణ్‌కు భయపడి రాత్రికి రాత్రి రోడ్డు వేశారు" అంటూ పేర్కొన్నారు.