శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Modified: గురువారం, 8 సెప్టెంబరు 2016 (13:28 IST)

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్డీఎక్స్ కలకలం..

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో లిక్విడ్‌ ఆర్డీఎక్స్ కలకలం సృష్టించింది. రైల్వేకోడూరుకు చెందిన అజ్జీ అన్వర్‌, అజ్జి సత్తార్‌, రాకేష్‌, మహ్మద్‌ రౌషిద్‌లు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ఎయిర్‌ ఇండియా నుండి హైదరాబాద్‌కు వెళ్ళి అక్కడి నుండి డిల్లీకి వెళ్

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో లిక్విడ్‌ ఆర్డీఎక్స్ కలకలం సృష్టించింది. రైల్వేకోడూరుకు చెందిన అజ్జీ అన్వర్‌, అజ్జి సత్తార్‌, రాకేష్‌, మహ్మద్‌ రౌషిద్‌లు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ఎయిర్‌ ఇండియా నుండి హైదరాబాద్‌కు వెళ్ళి అక్కడి నుండి డిల్లీకి వెళ్ళాలి. అయితే రేణిగుంట విమానాశ్రయ సిబ్బంది వారిని తనిఖీ చేస్తుండగా చిన్న టిన్‌లలో లిక్విడ్‌ కనిపించింది. ఇది మొత్తం కూడా ఆర్డీఎక్స్‌గా అనుమానించిన రేణిగుంట విమానాశ్రయ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే జిల్లా ఎస్పీ జయలక్ష్మికి సమాచారం అందించగా ఆమె తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని వారిని విచారించారు.
 
అయితే తమ వద్ద ఉన్నది శరీర నొప్పులకు వాడే ఔషధం మాత్రమేనని, అది ఆర్డీఎక్స్ కాదని అనుమానితులు పోలీసుల విచారణలో తెలిపారు. మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటలకు అనుమానితులను పోలీసులు, ఎయిర్‌ పోర్ట్ సిబ్బంది విచారిస్తూనే ఉన్నారు. చివరకు లిక్విడ్‌ను హైదరాబాద్‌ సిసిఎల్‌కు పరిశీలన నిమిత్తం పంపారు. రిపోర్టులు వచ్చిన తరువాతనే నిందితులను విడుదల చేస్తామని, ఎట్టిపరిస్థితిల్లోను వారిని వదిలేది లేదని జిల్లా ఎస్పీ జయలక్ష్మి చెబుతున్నారు.
 
మరోవైపు అనుమానితుల బంధువులు పోలీసులు వూరికే హైరానా సృష్టిస్తున్నారని, శరీర నొప్పులకు వాడే ఔషధం మాత్రమే చెబుతున్నారు. తమ వారు బొప్పాయి బిజినెస్‌ చేసే వారని, రైల్వేకోడూరులో బొప్పాయిని కొనుగోలు చేసి తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతున్నారని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి వెళుతుంటారని అయితే ఈసారి పోలీసులు అన్యాయంగా తమ వారిని అరెస్టు చేశారని చెబుతున్నారు.