శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (12:52 IST)

ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డిపై వేధింపులు లేవుగానీ, పని ఒత్తిడి వుంది: గోపికృష్ణ కమిటీ

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్యకు అధికారుల వేధింపులు కారణం కాదని అదనపు డీజీ గోపీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తేల్చి చెప్పింది. ఈమేరకు డీజీపీ అనురాగ్

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్యకు అధికారుల వేధింపులు కారణం కాదని అదనపు డీజీ గోపీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తేల్చి చెప్పింది. ఈమేరకు డీజీపీ అనురాగ్‌శర్మకు ఆయన నివేదిక సమర్పించారు. మొత్తం ఐదు పేజీల నివేదికలో పలు అంశాలు పేర్కొన్నారు. ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య అనంతరం గోపీకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 
 
గతేడాది ఇదే పోలీస్‌స్టేషన్లో రామకృష్ణారెడ్డి అనే ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం, ఇక్కడ అధికారుల వేధింపులున్నాయని పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు అధికారుల వేధింపులు కారణం కాదని, పని ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న బ్యూటీషియన్‌ శిరీష వ్యవహారంలో ప్రభాకర్‌రెడ్డి కలత చెంది బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
 
శిరీష ఆత్మహత్య చేసుకోవడంతో తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని ఆందోళన చెందినట్లు, బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న తన బ్యాచ్‌మేట్‌ హరీందర్‌కు ఫోన్‌ చేసి ఈ ఆత్మహత్య గురించి విచారించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ‘అన్ని విషయాలూ తెలిసి నన్ను ఎందుకు అడుగుతున్నావ్‌’ అంటూ హరీందర్‌ ఎదురు ప్రశ్నించడంతో ప్రభాకర్‌రెడ్డి మరింత ఆందోళన చెందినట్లు, ఆత్మహత్యకు ముందురోజు చాలా ముభావంగా ఉన్నాడని నివేదికలో పేర్కొనట్లు సమాచారం.