పవన్‌పై నిప్పులు చెరిగిన రోజా: ఆయనో ప్యాకేజీ కల్యాణ్, కాసుల కల్యాణ్ అంటూ..?
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ ప్యాకేజీ కల్యాణ్, కాసుల కల్యాణ్‌గా రోజా అభివర్ణించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ దళారీగా పవన్ వ్యవహరిస్త
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ ప్యాకేజీ కల్యాణ్, కాసుల కల్యాణ్‌గా రోజా అభివర్ణించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ దళారీగా పవన్ వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ చేతిలో పవన్ పావుగా మారిపోయారని రోజా ఆరోపించారు. ఏదైనా ఓ సమస్యపై వైకాపా పోరాడితే టీడీపీ పవన్‌ను తెరపైకి తెస్తుందన్నారు.
సమస్యలపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని.. కానీ ప్రశ్నిస్తానని అంటోన్న పవన్ కల్యాణ్‌కి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలు కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం వస్తే మాత్రం పవన్ ప్రత్యక్ష మవుతున్నారన్నారు. మొగల్తూరు ఆక్వా ఫ్యాక్టరీలో ఐదుగురు చనిపోతే, కంపెనీ యాజమాన్యానికి ఏపీ సీఎం చంద్రబాబు మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. ఇంకా తుందుర్రు దగ్గర పెట్టే కంపెనీలోనూ ఇటువంటి ప్రమాదాలే జరుగుతాయని ఆరోపించారు. ఆక్వా పరిశ్రమలను సముద్రం దగ్గరే పెట్టాలని డిమాండ్ చేశారు.
మరోవైపు పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా రోజా విమర్శలు గుప్పించారు. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి చితిమంటలు ఆరకముందే.. ఆయన కుమార్తెను ఊరి పొలిమేరలు దాటించి చంద్రబాబు శవరాజకీయాలకు పాల్పడ్డారని రోజా నిప్పులు చెరిగారు. పదకొండు రోజుల మైల కూడా తీరకమునుపే, ఆడబిడ్డను అసెంబ్లీకి తీసుకు వచ్చారని ఆరోపించారు.
తండ్రి అంత్యక్రియలు 4 గంటలకు జరిగితే, ఆ రాత్రికే ఆమెను ఆళ్లగడ్డ నుంచి విజయవాడకు బలవంతంగా తీసుకువచ్చారని, అసెంబ్లీలో దిగజారుడు రాజకీయాలు చేశారని, వీటన్నింటినీ ప్రజలు చూస్తున్నారనే విషయాని గుర్తు చేసుకోవాలని రోజా అన్నారు. భూమానాగిరెడ్డి మృతికి చంద్రబాబే కారణమని రోజా ధ్వజమెత్తారు.