మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (07:38 IST)

ఆంధ్రప్రదేశ్‌ లో రూ.15కే కేజీ ఉల్లి

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఏపీలో కిలో ఉల్లిని రూ.15లకే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొద్ది రోజుల నుంచీ ఉల్లి ధరలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోన్న విషయం తెలిసిందే.

ఉల్లి ధరలు ఇంకా సామాన్యులకు అందుబాటులోకి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా రైతుల నుంచి ఉల్లిని సేకరించి రాష్ట్రంలోని 101 రైతు బజార్లలో చి కిలో రూ.15లకే పంపిణీ చేయనుంది. కడప ఉల్లికి కిలోకు రూ. 50 నుంచి రూ.60లు ప్రభుత్వం చెల్లించనుంది.

కాగా.. రోజుకు 50 నుంచి 60 టన్నుల ఉల్లిని మార్కెటింగ్‌ శాఖ తెప్పించనుంది. వీటిని కిలో రూ.15కే వినియోగదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 130 రైతుబజార్లు ఉండగా, పెద్ద యార్డుల్లో మాత్రమే రాయితీ ఉల్లిని పంపిణీ చేస్తున్నారు.