కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)
RTC Bus
సూపర్ లగ్జరీ బస్సు 37 మంది ప్రయాణీకులతో అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతుండగా ఐలూరు - ఐనపూరు మధ్య ఈ ఘటన జరిగింది. బస్పు పదిహేను అడుగుల మేర దిగువకు దుసుకెళ్లింది. నీటి స్థాయి తక్కువగా ఉండడంతో.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో రోడ్డు గతుకులమయంగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2024
విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ఐలూరు-ఐనపూరు మధ్య జరిగిన ప్రమాదం
రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండటంతో అదుపుతప్పి 15 అడుగుల కిందికి వెళ్లిన బస్సు
బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులు సేఫ్#Vijayawada #RTCBus #Bigtv pic.twitter.com/6HC7XkCNpI
