సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (12:00 IST)

రైలు ఆలస్యంగా వచ్చిందని రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

window glass damage
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారు. రైలు ఆలస్యంగా వచ్చిందని రైలింజన్ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌‌కు సమీపంలోని మదన్ మహాల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రైలు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన కొందరు ప్రయాణికులు లోకో పైలెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలింజన్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. పైగా, లోకో పైలెట్, అసిస్టెంట్ పైలెట్లపై దాడికి యత్నించారు. అయితే, ఇంజిన్ తలుపులు లాక్ చేసుకుని వారిద్దరూ లోపలో ఉండిపోయారు. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని దుర్భాషలాడుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది.