సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (18:21 IST)

నిర్మల్ : హోటల్‌లో భోజనం చేసిన MP మహిళ మృతి.. 9 మందికి అస్వస్థత

deadbody
నిర్మల్ పట్టణంలోని ఓ హోటల్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురైన పది మందిలో ఒకరు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బోథ్ మండలం పొచ్చెర గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వంట మనిషి, మధ్యప్రదేశ్‌కు చెందిన ఫుల్ కలి బైగా (19) ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిర్మల్ పోలీసులు తెలిపారు. ఆదివారం పట్టణంలోని గ్రిల్ నైన్ హోటల్‌లో భోజనం చేసిన పది మందికి విరేచనాలు, వాంతులు అయ్యాయి. 
 
నిర్మల్‌లో వస్త్రాల కోసం షాపింగ్ చేసి హోటల్‌లో పాఠశాల సిబ్బందితో పాటు వంట మనిషి చికెన్ కూర, అన్నం పెట్టించినట్లు తెలిసింది. ఇలా వీరిలో ఒకరు ఆసుపత్రి పాలయ్యారు. ఈ అస్వస్థతకు కారణం ఫుడ్ పాయిజన్ అని వైద్యులు తెలిపారు. మిగిలిన వారు సోమవారం ఆసుపత్రిలో చేరారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ స్మిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.