సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 నవంబరు 2024 (11:55 IST)

నెల్లూరులో మహిళను హత్య చేసి కదులుతున్న రైల్లో నుంచి విసిరేశారు (video)

man
నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ రైల్లో షాకింగ్ ఘటన జరిగింది. కదులుతున్న రైల్లో నుంచి తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి ఓ పెద్ద సూట్ కేసుని బయటకు విసిరి పడేసారు. ఐతే ఆ సమయంలో ఆర్.పి.ఎఫ్ కానిస్టేబల్ అలా సూట్ కేసుని బైట పడేయడాన్ని గమనించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
పూర్తి వివరాలను గమనిస్తే... నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ ప్యాసింజరు రైలులో సుబ్రహ్మణ్యం, దివ్యశ్రీ అనే ఇద్దరు తండ్రికూతుళ్లు పెద్ద సూట్ కేసుని తీసుకుని రైలు ఎక్కారు. ఐతే రైలు తమిళనాడులోని మీంజూరు స్టేషను వద్దకు చేరుకుంటూ వుండగా వారిద్దరూ ఆ సూట్ కేస్ ను బయటకు విసిరేసారు. అది గమనించిన ఆర్.పి.ఎఫ్ కానిస్టేబుల్ మహేష్ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని తమిళనాడు రైల్వే పోలీసుల వద్దకు తీసుకెళ్లాడు.
 
అనంతరం వారు విసిరేసిన సూట్ కేసుని తీసుకుని వచ్చి తెరిచి చూడగా అందులో హత్య చేయబడిన మహిళ శరీరం వుంది. దీనితో ఆ ఇద్దరి నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.